Pondicherry works department arranged green roof at traffic signals: కొన్నిరోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. బైటకు వెళ్లాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఉదయం తొమ్మిది దాటిందంటే చాలు.. భానుడు భగ భగమండిపోతున్నాడు. ప్రజలు ఉదయం నుంచి సాయత్రం ఐదువరకు కూడా బైటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఎండలు ఆ సమయంలో ఠారెత్తిస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు.. 46 డిగ్రీలను దాటిపోయి యాభై వరకు వెళ్లేందుకు సిద్దంగా ఉంది. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదంటూ సూచనలు చేశారు. ఎండలో బైటకు వెళ్లాల్సి వస్తే.. ఎక్కువగా నీళ్లు తాగాలని, వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఫ్రూట్ జ్యూస్, నిమ్మకాయ జ్యూస్, కొబ్బరి బొండం వంటి పానీయాలను వాటిని ఎక్కువగా తాగాలని కూడా చెప్తున్నారు.
ఈ క్రమంలో ఎండల వల్ల రోడ్డుపైన వెళ్తున్న..కారులో, ఇతర వాహనాలలో వెళ్తున్న వారికి ఎండ నుంచి కొంత ఉపశమనం ఉంటుంది. కానీ అదే సమయంలో.. టూవీలర్ పైన వెళ్తున్నవారు మాత్రం తీవ్రమైన ఇబ్బందులుపడుతున్నారు. ముఖ్యంగా సిగ్నల్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం జనాలు అల్లాడిపోతున్నారు. దీంతో.. పుదుచ్చేరి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారులు కాస్తంతా వెరైటీగా ఆలోచించారు. అనేక చోట్ల జనాలు ఎండలతో అల్లాడిపోవడంను చూసి వినూత్నచర్యలు చేపట్టారు.
పుదుచ్చేరి ఉన్న సిగ్నల్ ల దగ్గర.. గ్రీన్ కార్పెట్ లను ఏర్పాటు చేశారు. దాదాపుగా పుదుచ్చేరి నగరంలో ఉన్న అన్ని ప్రదేశాలలో ఇలాంటి చలువ పందిళ్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. టూవీలర్ వాసులకు ఇది భారీగా ఉపశమనం లభించిందని చెప్పుకొవచ్చు. అక్కడి వారంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదుపాయాలపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు పుదుచ్చేరి అధికారుల ఐడియా బాగుందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. పుదుచ్చేరిని ఆదర్శంగా తీసుకుని, ఇలాంటి చలువ పందిళ్లను ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter