Republic Day Significance: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకొంటారో తెలుసా?

Republic Day Significance: భారతదేశంలో ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈసారి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ రిపబ్లిక్ డే వెనకున్న చరిత్ర.. దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? తెలియకపోతే ఈ స్టోరీ చదవాల్సిందే!  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 10:19 AM IST
Republic Day Significance: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకొంటారో తెలుసా?

Republic Day Significance: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత మన స్వాతంత్ర్య దేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని నిర్మించిచుకోవాలని.. అప్పట్లో డా.బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రచించిందో కమిటీ. ఆ రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న అమోదించగా.. దాన్ని 1950 జనవరి 26 నుంచి అమలు చేశారు. దీంతో అప్పటి నుంచి భారతదేశం ప్రజాస్వామ్య, సార్వభౌమ, గణతంత్ర దేశంగా ఎదిగింది. అప్పటి నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. 

దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 26 జనవరి 1950న తుపాకుల వందనంతో జెండాను ఎగురవేసి భారతదేశాన్ని సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇదే రోజున (జనవరి 26) గణతంత్ర దినోత్సవంగా దేశ ప్రజలు జరుపుకొంటారు.  

1950 జనవరి 26 మొదటి గణతంత్ర వేడుకలు

దేశంలో మొదటి గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26న జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో ఆ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దేశంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున బ్రిటీష్ చట్టాన్ని రద్దు చేయడం సహా కొత్త రాజ్యాంగం అమలు చేయబడింది.

గణతంత్ర దినోత్సవ చరిత్ర

భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ బానిసత్వం నుంచి విముక్తి పొంది.. స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుంది. అయితే స్వాతంత్ర్యం తర్వాత, మన దేశానికి దాని స్వంత రాజ్యాంగం లేదు. భారత ప్రభుత్వ చట్టం 1935 ఆధారంగా భారతదేశ పాలన జరిగేది. దీని తర్వాత, 1947 ఆగస్టు 29న, డా. భీమ్‌రావ్ అంబేద్కర్ నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి.. భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. అందుకు గుర్తుగా ఈ రోజును (జనవరి 26) భారతదేశ గణతంత్ర దినోత్సవంగా ప్రజలు జరుపుకొంటారు. 

ఈ రోజున (జనవరి 26) భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశంలోని అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతి వద్ద జెండాను ఎగురవేస్తారు. అయితే, ఇప్పుడు యుద్ధ స్మారక చిహ్నంలో అమర్ జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కొద్ది రోజుల క్రితం ఈ మార్పు జరిగింది. రిపబ్లిక్ డే రోజున దేశంలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలు, కార్యాలయాలతో పాటు అన్నీ రంగాల వారు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటారు.  

Also Read: Republic Day 2022: ఈసారి అదిరిపోనున్న బీటింగ్ రిట్రీట్, అలాంటి డ్రోన్ షో అసలు చూసి ఉండరు!

Also Read: Republic Day 2022: రిపబ్లిక్ డే సందర్భంగా నక్సల్స్, ఉగ్రవాదులు దాడులట, అక్కడ హైఅలెర్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News