Reliance Jio starts 5G trials: ముంబై: రిలయన్స్ జియో భారత్‌లో తయారైన పరికరాలతో (made-in-India equipment) సహాయంతో ముంబైలో 5G ట్రయల్స్ ప్రారంభించింది. త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, అహ్మెదాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లోనూ 5G ట్రయల్స్ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ఇప్పటికే ఆయా టెలికాం సర్కిల్స్‌లో 5G ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు రిలయన్స్ జియో తెలిపింది.
టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతులు వచ్చిన మరుక్షణమే రిలయన్స్ జియో ముంబైలో 5G ట్రయల్స్ మొదలుపెట్టిందని తెలుస్తోంది. అయితే, 5G ట్రయల్స్ సందర్భంగా గరిష్టంగా 5G speed పని తీరు ఎలా ఉంది అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.
ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ముంబైలో మిడ్, ఎంఎం వేవ్ బ్యాండ్స్‌లో ఈ 5G trials చేపట్టినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, ఎయిర్ టెల్ (Airtel) ఇప్పటికే గుర్‌గావ్‌లోని సైబర్ హబ్ ఏరియాలో మిడిల్ బ్యాండ్ స్ప్రెక్ట్రంలో 5G ట్రయల్స్ షురూ చేసిన సంగతి తెలిసిందే.
5G spectrum కోసం త్వరలోనే ట్రాయ్ (TRAI) వేలం చేపట్టనున్న నేపథ్యంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ వంటి టెలికాం దిగ్గజాలు ఈ 5G trials నిర్వహిస్తుండటం గమనార్హం. 2021 చివరి నాటికి లేదా 2022 ఆరంభం నాటికల్లా కొన్ని ప్రాంతాల్లో 5G network సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ భావిస్తోంది. అలాగే మరో ఐదారేళ్ల పాటు 4G network సేవలు అందుబాటులో ఉంటాయని ట్రాయ్ చెబుతోంది.