Pushpa Stlye Smuggling: పుష్ప మూవీ స్టైల్లో ఎర్రచందనం అక్రమ రవాణా.. పోలీసులను బోల్తా కొట్టించేశాడు!

Pushpa Stlye Lorry Driver: పండ్ల మాటున కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్ర చందనం దుంగల్ని తరలించే లారీ డ్రైవర్‌‌ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ పుష్ప మూవీ స్టైల్‌ స్మగ్లర్‌‌ స్టోరీ ఒకసారి చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 09:45 AM IST
  • పుష్ప మూవీలో మాదిరిగా ఎర్ర చందనం స్మగ్లింగ్‌
  • చెక్‌పోస్ట్‌లలో పోలీసులను బోల్తా కొట్టించిన నిందితుడు
  • చివరకు కర్ణాటక.. మహారాష్ట్ర సరిహద్దులలో పోలీసులకు చిక్కిన స్మగ్లర్
Pushpa Stlye Smuggling: పుష్ప మూవీ స్టైల్లో ఎర్రచందనం అక్రమ రవాణా.. పోలీసులను బోల్తా కొట్టించేశాడు!

Red Sandalwood Smuggling: ఆ స్మగ్లర్‌‌ చెక్‌ పోస్ట్‌లన్నింటినీ తప్పించుకపోవడంలో నేర్పరి. పుష్ప మూవీలో మాదిరిగా ఎర్ర చందనాన్ని దొంగతనంగా రవాణా చేయడంలో దిట్ట. అలాంటి స్మగ్లర్‌‌ (Smuggler‌) చివరకు కర్ణాటక.. మహారాష్ట్ర సరిహద్దులలో పోలీసులకు చిక్కాడు. 

ఈ నిందితుడి పేరు సయ్యద్‌ యాసిన్‌. పోలీసులు ఇతన్ని అరెస్ట్‌ చేసి ఎర్ర చందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రెండు కోట్ల నలభై ఐదు లక్షలకు పైనే అని తేలింది. ఇక ఎర్ర చందనం దుంగలను (Red sandalwood) తరలిచేందుకు ఉపయోగించిన లారీ విలువ రూ.10 లక్షలకు పైగే ఉంటుందని పోలీసులు తెలిపారు. 

కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న ఆనేకల్‌కు చెందిన సయ్యద్‌ యాసిన్‌ తన లారీలో కొవిడ్‌ బాధితులకు పండ్లను సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులకు చెప్పేవాడు. ప్రతి చెక్‌ పోస్ట్‌లో పోలీసులను ఇలాగే నమ్మించేవాడు. అంతేకాదు తన లారీ ముందు భాగంలో కూడా పండ్లను సరఫరా చేసే వాహనం అంటూ రాయించాడు.

ఇక పండ్ల చాటున పెద్ద ఎత్తున తరుచుగా ఎర్ర చందనం దుంగల్ని తరలించేవాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గుర్తు తెలియని ప్రాంతం నుంచి వాటిని తీసుకెళ్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఆంధ్రప్రదేశ్‌, (Andhra Pradesh) కర్ణాటక బార్డర్‌‌లలో పోలీసులను సులభంగా నమ్మించ గలిగినా.. చివరకు మహారాష్ట్ర (Maharashtra) పోలీసులకు చిక్కాడు. 

మహారాష్ట్రలో గాంధీ చౌక్‌ ప్రాంతంలో నిర్వహించిన పోలీసుల తనిఖీలో నిందితుడు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీని వెనుక ఉన్న ముఠా ఎవరనే కోణంలో పోలీసులు (Police) దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: అటకెక్కలేదు.. లైగర్ తర్వాత ఆ సినిమానే, విజయ్ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Also Read: Aishwarya Dhanush Covid 19: కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య ధనుష్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News