ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా...డిశార్జ్ కేసులు కూడా అధికమవడం ఊరట కల్గిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో ఒకేరోజు రికార్డు స్థాయిలో 51 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ ఒక్కరోజులో డిశ్చార్జ్ అయినవారి సంఖ్యలో ఇదే అత్యధికం.
దేశంలో ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నా రికవరీ రేటు కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. చికిత్స పొందుతున్నవారి కంటే డిశ్చార్జ్ అయినవారి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. తాజాగా ఒక్కరోజులేనే 51 వేల 706 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయినవారి సంఖ్యతో పోలిస్తే ఇదే అత్యధికంగా ఉంది. ఇప్పటివరకూ దేశంలో 19 లక్షల 8 వేల 254 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 12 లక్షల 82 వేల 215 మంది కోలుకున్నారు. 39 వేల 795 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 5 లక్షల 86 వేల 244 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 67.19 శాతంగా ఉంది. మరణాల రేటు 2.09 శాతానికి తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజులో 6 లక్షల 19 వేల 62 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకూ దేశంలో చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2 కోట్ల 14 లక్షల 84 వేల 402 గా ఉంది. Also read: Pm Modi: అంతవరకూ అయోధ్యలో కాలుపెట్టనని ప్రతిజ్ఞ చేసిన మోదీ