RBI Recruitment 2021: బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అలర్ట్. దేశంలో బ్యాంకులకే బ్యాంకుగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) పోస్టుల దరఖాస్తుకు గడువు ముగియనుంది. ఫిబ్రవరి 15తో ఆర్బీఐ గ్రేడ్ బి, జూనియర్ ఇంజనీర్ పోస్టుల దరఖాస్తులకు తుది గడువు ఉంది.
గ్రేడ్ బి పోస్టుల భర్తీకి జవనవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేయగా, మరొక్క రోజుతో దరఖాస్తుల గడువు ముగియనుంది. మార్చి 6న పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 322 జూనియర్ ఇంజనీర్, గ్రేడ్ బి పోస్టుల్ని భర్తీ ప్రక్రియ చేపట్టింది. జాబ్స్(Govt Jobs 2021) పేపర్ 1ను మార్చి 6న కన్ఫామ్ చేయగా, పేపర్ 2 మరియు 3 ఆన్లైన్/రాత పరీక్షలు మార్చి 31న నిర్వహించననున్నట్లు ప్రాథమికంగా ఆర్బీఐ తెలిపింది.
Also Read: EWS Reservation: ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరెవరు పొందవచ్చు, ఈ కండీషన్స్ తెలుసుకోండి
ఆర్బీఐ గ్రేడ్ బి 2021 పోస్టుల వివరాలు
గ్రేడ్ బి (డీఆర్) జనరల్ పోస్టులు - 270
గ్రేడ్ బి (డీఆర్) డీఈపీఆర్ పోస్టులు - 29
గ్రేడ్ బి (డీఆర్) డీఎస్‌ఐఎమ్ పోస్టులు - 23
వేతనం - రూ. 35,150- రూ.83,254 (అంచనా)
జనరల్ పోస్టులకు 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. టెన్స్ మరియు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలలో 60 మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
Reserve Bank Of India డీఈపీఆర్ పోస్టులకు ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్సు, ఫైనాన్స్ లలో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే పీజీడీఎం/ఎంబీఏ ఫైనాన్స్ డిగ్రీ చదివిన వారికి 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి
Official Notification For RBI Jobs 2021
డీఎస్ఐఎం పోస్టులకు స్టాటిస్టిక్స్, మ్యాథమేటికల్ స్టాటిస్టిక్స్, ఎకనోమెట్రిక్స్లో మాస్టర్స్ ఉత్తీర్ణులవ్వాలి. మ్యాథమేటిక్స్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, స్టాటిస్టిక్స్ లేదా సంబంధిత సబ్జెక్టులో ఏడాది పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణలను అర్హులుగా పరిగణిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook