Indo-China disputes: ఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై, ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని (Central government) లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాతీయ ప్రయోజనాలను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఏల్ఏసీ వెంబడి సాధారణ పరిస్థితిని కొనసాగించేందుకు ఎందుకు పట్టుబట్టలేదని, సమగ్రత విషయాలను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. చైనా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గాల్వన్ లోయలో జరిగిన తప్పిదంపై స్పష్టంగా ఉందన్నారు. Read also: CAPF: కేంద్ర భద్రతాబలగాలకు కరోనా సెగ: 27 మంది మృతి
అన్నింటికన్నా జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని వాటిని కాపాడటం ప్రభుత్వ విధి అంటూ.. కేంద్ర ప్రభుత్వానికి మూడు ప్రశ్నలను సంధించారు. ఈ మేరకు ట్వీట్లో ఇలా రాశారు. యథాతథస్థితిని కొనసాగించేందుకు ఎందుకు పట్టుబట్టలేదు? మన 20 మంది నిరాయుధులైన జవాన్ల హత్యను సమర్థించుకోడానికి చైనాకు ఎందుకు అనుమతిచ్చారు.? గాల్వన్ లోయ ప్రాదేశిక సార్వభౌమాధికారం గురించి ఎందుకు ప్రస్తావించలేదు.? అంటూ చైనా విడుదల చేసిన ప్రకటన కాపీని ట్వీట్‌కు జతచేశారు. Read also: China apps: భారత్ బాటలో అమెరికా.. చైనా యాప్స్ నిషేధం
లక్షలాది కుటుంబాలకు నష్టం..
ఇదిలాఉంటే... దేశ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించకపోతే లక్షలాది కుటుంబాలు ధ్వంసం అవుతాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనిని ఎంతోకాలం మౌనంగా అంగీకరించరు.. అంటూ #BJPsDistractAndRule హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. కోవిడ్-19 వల్ల 2020-21లో భారత దేశ ఆర్థికాభివృద్ధి 4.5 శాతానికి తగ్గుతుందని పేర్కొంటున్న నివేదికను ఈ ట్వీట్‌కు జోడించారు. Read also: SBI New Rules: ఎస్బీఐ వినియోగారులు ఎక్కువ విత్ డ్రా చేస్తే వాయింపే
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..