Punjab Politics: నవజ్యోత్ సిద్ధూ కుమార్తె రబియా పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు

Punjab Politics: పంజాబ్ కాంగ్రెస్ మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యనేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ కుమార్తె రబియా సిద్ధూ పొలిటికల్ ఎంట్రీ వార్తలు హల్‌చల్ అవుతున్నాయి. ఆమె చేసిన సందడి పొలిటికల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 18, 2021, 05:30 PM IST
  • నవజ్యోత్ సింగ్ సిద్ధూ కుమార్తె రబియా సిద్ధూ రాజకీయ ప్రవేశంపై వైరల్ అవుతున్న వార్తలు
  • గత పదిరోజులుగా వివిధ కార్యక్రమాల్లో ఆమె చూపిస్తున్న వైఖరే కారణమంటూ వార్తలు
  • రాజకీయ రంగప్రవేశం వార్తల్ని ఖండించిన రబియా సిద్ధూ
Punjab Politics: నవజ్యోత్ సిద్ధూ కుమార్తె రబియా పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు

Punjab Politics: పంజాబ్ కాంగ్రెస్ మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యనేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ కుమార్తె రబియా సిద్ధూ పొలిటికల్ ఎంట్రీ వార్తలు హల్‌చల్ అవుతున్నాయి. ఆమె చేసిన సందడి పొలిటికల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. 

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు(Punjab Assembly Elections)వచ్చే ఏడాది జరగనున్నాయి. ఇప్పటికే అధికారపగ్గాలు మరో వ్యక్తికి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్‌లో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ముఖ్యనేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ కుమార్తె రబియా సిద్ధూ సందడి ఎక్కువవుతోంది. రబియా పొలిటికల్ ఎంట్రీ వార్తలు రాష్ట్రంలో హల్‌చల్ చేస్తుున్నాయి. ఓ సమావేశంలో మెరిసిన రబియా సిద్ధూ(Rabia Sidhu) చేసిన హడావిడి దీనికి కారణం. పూర్తిగా పరిణితి చెందిన రాజకీయ నాయకురాలిగా ఆమె చేసిన సందడి రాష్ట్రంలో పొలిటికల్ బజ్‌కు కారణమవుతోంది. 

నవజ్యోత్‌సింం‌గ్ సిద్దూ(Navjot sindh sidhu) పార్టీ పనుల్లో బిజీగా ఉంటే..రబియా సిద్ధూ(Rabia Sidhu) రాజకీయంగా దూసుకుపోతారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సిద్ధూ అసెంబ్లీ నియోజకవర్గమైన అమృత్‌సర్ ఈస్ట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు..ఆమె సుడిగాలి పర్యటన స్థానికుల్ని ఆకట్టుకుంది. రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తల్ని గతంలో రబియా ఖండించినా..పదిరోజుల వ్యవధిలో ఆమె చేస్తున్న కార్యక్రమాలు పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తూ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్ ఈస్ట్ నుంచి పోటీ చేయనుందనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి.

మరోవైపు రాజకీయ ప్రవేశంపై వార్తల్ని రబియా మరోసారి ఖండిస్తూనే నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల్ని వివరించింది. 2012లో శిరోమణి అకాళీదళ్-బీజేపీ టికెట్‌పై సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ పోటీ చేసి విజయం సాధించింది. ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకు, సిద్ధూకు మధ్య విభేధాలు కొనసాగుతున్న నేపధ్యంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఇదే చివరి అవకాశమని..సిద్ధూ అధిష్టానానికి లేఖ రాశారు. 2017 ఎన్నికల హామీలు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని కదిలించాలని అక్టోబర్ 15న రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Also read: Kerala Flood Tragedy: తేలే కార్లు, మునిగిన బస్సు, కూలుతున్న ఇళ్లు, కేరళ భయానక దృశ్యాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News