Punjab Politics: పంజాబ్‌లో రాజకీయాలు మారనున్నాయి. కాంగ్రెస్ అసంతృప్తనేత, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ సొంత పార్టీ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. కెప్టెన్ సొంతపార్టీ ప్రభావం కచ్చితంగా కాంగ్రెస్‌పై పడనుందనే అంచనాలున్నాయి.
పంజాబ్ రాష్ట్రంలో(Punjab)నాయకత్వ పగ్గాల మార్పిడి కీలక పరిణామాలు దారి తీస్తోంది. పంజాబ్ అధికార పార్టీలో రేగిన అలజడి ఇంకా చల్లారలేదు.కెప్టెన్ అమరిందర్ సింగ్ వర్సెస్ నవజ్యోత్‌సింగ్(Navajot singh sidhu) సిద్ధూ వర్సెస్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీలుగా సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ సొంత కుంపటి పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు. అవమానకరంగా సీఎం పదవి నుంచి తప్పించిన కాంగ్రెస్ పార్టీని సాధ్యమైనంతగా దెబ్బతీసే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. కెప్టెన్ అమరిందర్ సింగ్(Captain Amarinder Singh)సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద సీనియర్ నేత. రాష్ట్రంలో కెప్టెన్ మద్దతుదారులు చాలామందే ఉన్నారు. ఈ నేపధ్యంలో కెప్టెన్ సొంత పార్టీ ప్రభావం కచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై ఎంతో కొంత ఉంటుందనేది అంచనా. నవజ్యోత్‌సింగ్ సిద్ధూతో తీవ్ర విభేదాల కారణంగా గత నెలలో అమరిందర్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది. అతని స్థానంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీను కూర్చోబెట్టింది. అయితే ఆ తరువాత చరణ్‌జిత్‌తో విభేదాల కారణంగా సిద్ధూ పార్టీకు రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్(Congress)అధిష్టానం సిద్దూకు నచ్చజెప్పింది.
పంజాబ్ భవిష్యత్ కోసం పోరాటం కొనసాగుతోందని..త్వరలోనే సొంత పార్టీని ప్రకటిస్తానని కెప్టెన్ అమరిందర్ సింగ్ స్పష్టం చేశారు. పంజాబీలు, రాష్ట్ర ప్రయోజనాలకై పనిచేస్తానన్నారు. ఏడాదికాలంగా మనుగడకై పోరాడుతన్న రైతుల ప్రయోజనాల కోసం కూడా కృషి చేస్తానని చెప్పారు. అంతేకాకుండా బీజేపీతో(Bjp)పాటు అకాళీదళ్ చీలికవర్గాలైన దిండ్సా, బ్రహ్మపురాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని తెలిపారు. రైతు సమస్యలు సానుకూలంగా పరిష్కారమైతే బీజేపీతో పొత్తు ఉండవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook