Punjab govt withdraws general consent to CBI: న్యూ ఢిల్లీ: సీబీఐ కేసుల విషయంలో పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసుల విచారణ విషయంలో సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేస్తున్నట్టు పంజాబ్ సర్కార్ ప్రకటించింది. ఇకపై పంజాబ్ పరిధిలో విచారణ చేపట్టే సీబీఐ కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతే సీబీఐ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పంజాబ్ స్పష్టంచేసింది. దీంతో సీబీఐ ఎంట్రీకి నో చెప్పిన బీజేపీయేతర రాష్ట్రాల జాబితాలో పంజాబ్ కూడా చేరిపోయింది. సీబీఐకి సాధారణ సమ్మతిని రద్దు చేస్తూ జార్ఖండ్, కేరళ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్న వారం రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ సర్కార్ కూడా అదే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Also read : OU Degree Final Year Results 2020: ఈ వారమే ఓయూ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షా ఫలితాలు
గతంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాలు ( Maharashtra, West Bengal, Rajasthan and Chhattisgarh ) తమ రాష్ట్రాల్లో సీబీఐ విచారణకు ( CBI probe ) అనుమతి రద్దు చేస్తూ జీవో జారీచేశాయి. ఏపీలోనూ సీబీఐ విచారణను రద్దు చేస్తూ గత ప్రభుత్వం జీవో జారీచేసినప్పటికీ.. వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతేడాది జూన్‌లో ఆ జీవోను రద్దు చేసి రాష్ట్రంలో సీబీఐ విచారణకు సాధారణ సమ్మతిని పునరుద్ధరిస్తూ కొత్త ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Also read : NGT: ఢిల్లీలో నవంబరు 30 వరకు అన్ని రకాల టపాసులపై నిషేధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe