Night curfew and Weekend lockdown in Punjab: చండీఘడ్: కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ బాట పడుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ విధించగా తాజాగా పంజాబ్ కూడా ఆ రాష్ట్రాల జాబితాలో చేరిపోయింది. పంజాబ్ సర్కారు తాజా ఆదేశాల ప్రకారం అక్కడ ప్రతీ రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరునాడు తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ (Night curfew) అమలులో ఉండనుంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి మళ్లీ సాయంత్రం 6 గంటల వరకు అన్ని సేవలు యధావిధిగా అందుబాటులో ఉండనున్నాయి. అలాగే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వీకెండ్ లాక్‌డౌన్ (Weekend lockdown) అమలులో ఉండనుంది. ఈ మేరకు పంజాబ్ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
Due to continuous & rapid rise of #Covid19 cases in Punjab, Cabinet today has decided to impose daily lockdown from 6 PM to 5 AM and weekend lockdown from Friday 6 PM to Monday 5 AM. Urge you all to stay at home & step out only if absolutely necessary. Seek your full cooperation. pic.twitter.com/gS4TFlw5lZ
— Capt.Amarinder Singh (@capt_amarinder) April 26, 2021
Also read : Madras High Court: కరోనా వ్యాప్తికి కారణం వాళ్లే...మర్డర్ కేసు పెట్టాలి వారిపై
పంజాబ్‌లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందువల్లే రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టేన్ అమరిందర్ సింగ్ (Punjab CM Captain Amarinder Singh) ట్విటర్ ద్వారా ప్రకటించారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని, ఎంతో తప్పనిసరైతే తప్ప ఇంట్లోంచి బయటకు రాకూడదని సీఎం అమరిందర్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook