Narendra Modi: రేపు సీఎంలతో ప్రధాని వర్చువల్ సమావేశం

దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీ తదితర విషయాలపై సమీక్షించేందుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ).. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Last Updated : Nov 23, 2020, 12:19 PM IST
Narendra Modi: రేపు సీఎంలతో ప్రధాని వర్చువల్ సమావేశం

PM Narendra Modi virtual meet with states CM's tomorrow: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీ తదితర విషయాలపై సమీక్షించేందుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ).. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కోవిడ్ నివారణకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యులు, ప్రస్తుత పరిస్థితి, టీకా పంపిణీ తదితర అంశాలపై చర్చ జరుగునుంది. ఈ సమావేశంలో కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. అయితే ఈ సమావేశం రెండు దఫాలుగా జరగనున్నట్లు సమాచారం. 

ముందుగా ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదవుతున్న 8 రాష్ట్రాలతో.. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనున్నట్లు కనిపిస్తోంది. అయితే.. కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ (covid vaccine) దేశంలో మూడో దశలో ఉన్న నేపథ్యంలో పంపిణీ ఎలా చేయాలన్న దానిపై మోదీ ముఖ్యంగా సీఎంలతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతోపాటు ఆయా రాష్ట్రాల ప్రతినిధులు కూడా సమావేశం కానున్నారు. Also read: Delhi: కోవిడ్ గైడ్‌లైన్స్ ఉల్లంఘన.. రెండు మార్కెట్ల సీజ్

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా.. 44,059 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 511 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,39,866 కి చేరగా.. మరణాల సంఖ్య 1,33,738 కి పెరిగింది. ఇప్పటివరకు కరోనావైరస్ బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 85,62,642 కి చేరగా.. ప్రస్తుతం దేశంలో 4,43,486 కరోనా కేసులు యాక్టివ్‌ (active cases) ఉన్నాయి. Also read: Vedhika: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ‘రూలర్’ బ్యూటీ వేదిక

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News