క్షమాపణ పిటీషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తను పదవిలోకి వచ్చాక.. తన వద్దకు చేరిన తొలి క్షమాపణ పిటీషనును పరిశీలించి దానిని తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటనను కూడా విడుదల చేసింది.

Last Updated : Jun 3, 2018, 09:06 PM IST
క్షమాపణ పిటీషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తను పదవిలోకి వచ్చాక.. తన వద్దకు చేరిన తొలి క్షమాపణ పిటీషనును పరిశీలించి దానిని తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఓ కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులను అతి దారుణంగా హత్య చేసిన ఘటనలో జగత్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

అనేక పర్యాయాలు ఈ కేసులో విచారణ జరిగిన అనంతరం ఎట్టకేలకు భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు నిందితుడికి మరణ శిక్షను విధించింది. ఇటీవలే ఈ తీర్పును సవాలు చేస్తూ.. జగత్ రాయ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఈ క్షమాభిక్ష  పిటీషనును పరిశీలించిన రాష్ట్రపతి దానిని తిరస్కరించారు. ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి ఏ కేసులోనైనా సరే నిందితులకు క్షమాభిక్షను ప్రసాదించే అధికారం ఉంటుంది. గతంలో కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన వద్దకు వచ్చిన 30 క్షమాభిక్ష పిటీషన్లను తిరస్కరించారు. 

Trending News