Draupadi Murmu : 76వ గణతంత్ర దినోత్సవం..జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపది..మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ..

Draupadi Murmu : దేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం..గణతంత్ర దినోత్సవం సందర్భంగా..మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు రాష్ట్రపతి.   

Written by - Bhoomi | Last Updated : Jan 25, 2025, 10:29 PM IST
Draupadi Murmu : 76వ గణతంత్ర దినోత్సవం..జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపది..మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ..

Draupadi Murmu :రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో,నమస్కారం..గణతంత్ర దినోత్సవం సందర్భంగా..మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు రాష్ట్రపతి. "వాతావరణ మార్పు, ప్రపంచ ముప్పును ఎదుర్కోవటానికి మనలో ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ విషయంలో రెండు ఆదర్శప్రాయమైన కార్యక్రమాలు చేపట్టాయి.  ప్రపంచ స్థాయిలో, భారతదేశం ఒక ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది. పర్యావరణం కోసం మిషన్ లైఫ్‌స్టైల్ అని పిలవబడే పనిని చేయడం, పర్యావరణాన్ని రక్షించడంలో,  సంరక్షించడంలో వ్యక్తులు,  సంఘాలు మరింత చురుకుగా ఉండేలా ప్రేరేపించడం. భారతమాత విముక్తి కోసం త్యాగం చేసిన వారిని స్మరించుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 

 Also Read:  Padma Award 2025 for Sports: మాజీ క్రికెటర్ రవిచంద్రన్‌ అశ్మిన్‌కు పద్మ అవార్డు 

మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను మార్చుకున్నామని..ఈ ఏడాది కొత్త చట్టాలను రూపొందించి అమల్లోకి తెచ్చామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాను పరిరక్షించేందుకు నూతనశక్తిని నింపేందుకు సాంస్క్రతిక రంగంలో ఎన్నో ప్రోత్సాహకర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 

గుజరాత్ లోని వాద్ నగర్ లో భారతదేశపు మొదటి పురావస్తు ప్రయోగాత్మక మ్యూజియం పూర్తి కాబోతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో సాధించిన విజయాలు, క్రీడాకారులు ప్రదర్శనను రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇటీవలి సంవత్సరాల్లో అంతరిక్ష శాస్త్రం రంగంలో గొప్ప విజయాలను సాధించిందని అన్నారు. లక్ష్యాల దిశగా మన నిజమైన ప్రయాణం సాగుతుందన్నారు. ఇక భారత్ అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా ఎదగడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దులను పరిరక్షిస్తున్న సైనికులతో పాటు సరిహద్దుల్లో దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్న పోలీసులు, పారామిలటరీ బలగాలను రాష్ట్రపతి అభినందించారు. 

 Also Read: Padma Awards 2025: ఎట్టకేలకు గుర్తించారు..చరిత్రకు తెలియని 30 మంది వీరులకు పద్మ అవార్డులు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News