PM Narendra Modi to launch jan andolan campaign: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం సృష్టిస్తోంది. నిత్యం 70వేలకు పైగా కేసులు.. వేయికి చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో పండగ సీజన్ ప్రారంభం కానుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జన్ ఆందోళన్ (jan andolan) కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ రోజు ఉదయం ట్విట్ చేసి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో కరోనావైరస్‌ను కలిసికట్టుగా తరిమేద్దామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
India’s COVID-19 fight is people driven and gets great strength from our COVID warriors. Our collective efforts have helped saved many lives. We have to continue the momentum and protect our citizens from the virus. #Unite2FightCorona pic.twitter.com/GrYUZPZc2m
— Narendra Modi (@narendramodi) October 8, 2020
ఈ మేరకు ప్రధాని మోదీ ఈ విధంగా ట్విట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని.. భౌతిక దూరాన్ని పాటించాలని.. నిరంతరం చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండండి.. రెండు గజాల దూరం ఉండేలా..భౌతిక దూరం పాటించి కరోనాపై విజయం సాధిద్దామంటూ మోదీ పిలుపునిచ్చారు. Also read: Indian Air Force Day 2020: ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం: ఐఏఎఫ్ చీఫ్ భదౌరియా
ఇదిలాఉంటే.. దేశంలో గత 24గంటల్లో బుధవారం కొత్తగా.. 78,524 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 971 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 68,35,656 కి చేరగా.. మరణాల సంఖ్య 1,05,526 కి పెరిగింది. Also read: IndiGo విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
PM Narendra Modi: నియమాలు పాటిద్దాం.. కరోనాను జయిద్దాం