పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనలపై స్పందించిన ప్రధాని మోదీ

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పశ్చిమ బెంగాల్, అసోం, దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై ప్రధాని ట్వీట్ చేశారు. దేశంలో హింసాత్మక ఘటనలకు తావు ఉండకూడదన్నారు.

Last Updated : Dec 16, 2019, 04:40 PM IST
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనలపై స్పందించిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పశ్చిమ బెంగాల్, అసోం, దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై ప్రధాని ట్వీట్ చేశారు. దేశంలో హింసాత్మక ఘటనలకు తావు ఉండకూడదన్నారు. హింసాత్మక ప్రవృత్తి సమస్యకు పరిష్కారం కాదని తెలిపారు. దేశంలో ఇలాంటి వ్యతిరేక నిరసన జరగడం దురదృష్టకరమని పేర్కొన్న ఆయన.. ప్రజాస్వామ్యంలో డిబేట్, డిస్కషన్, డిస్సెంట్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అంతే కానీ నిరసన పేరుతో జరుగుతున్న ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాన్ని అందరూ ఖండించాలని హితవు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అందరూ తోడ్పడాల్సిన అవసరం ఉందని తెలిపారు. సాధారణ జీవన పరిస్థితులు నెలకొనే విధంగా దేశ ప్రజలు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనలపై స్పందించిన ప్రధాని మోదీ

Trending News