PM Modi: దేశ ప్రజలు 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధరించిన తలపాగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎరుపు, పసుపు కలగలిపిన వర్ణంతో ఈ తలపాగాను ప్రత్యేకంగా రూపొందించారు.
రాజస్తాన్ సంస్క్రతిక ప్రతీకగా ఆయన సఫాను ధరించారు. ఏటా స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలకు ప్రధాని మోదీ విభిన్నమై తలపాగాలు ధరించి హాజరవుతుంటారు. దేశంలోని పలు ప్రాంతాల సంస్క్రతిని ప్రతిబింబించేలా ఆయన జాగ్రత్త తీసుకుంటారు. 2024 గణతంత్ర వేడుకల్లో కుంకుమ, గులాబీ, తెలుపు, పసుపు రంగులతో కూడిన తలపాగాను మోదీ ధరించారు. ఇది గుజరాత్ సంస్క్రతికి అద్దం పట్టింది.
2023లో మహారాష్ట్రకు చెందిన ఫెటా 2022లో రిపబ్లిక్ డే వేడుకల్లో ఉత్తరాఖండ్ కు చెందిన టోపీని ధరించారు. 2021లో గుజరాత్ లోని జామ్ నగర్ సంస్క్రుతిని ప్రతిబింబించే హలారీ పగ్డీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది సాంస్క్రుతిక వారసత్వ ప్రాముఖ్యాన్ని మాత్రమే కాదు..ప్రాంతీయ హస్తకళలల నైపుణ్యాన్ని కూడా తెలియజేస్తుంది. 2020లో రిపబ్లిక్ డేలో కుంకుమ రంగులోని బంధేజ్ తలపాగాను ధరించారు. ఇది రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల సంస్క్రతిని ప్రతిబింబించింది.
76th #RepublicDay🇮🇳 | Prime Minister Narendra Modi signs the ceremonial book at the National War Memorial, in Delhi
(Source: PMO/YouTube) pic.twitter.com/Mnfp0o7yoy
— ANI (@ANI) January 26, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook