PM Modi launching PMUY scheme: న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం ప్రారంభించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మహోబలో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు. ఉజ్వల 2.0 పేరిట ప్రారంభించనున్న ఈ పథకం కింద నిరుపేదలైన లబ్ధిదారులకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌తో (Free LPG gas connection) ఇవ్వడంతో పాటు రీఫిల్ చేసిన ఫస్ట్ సిలిండర్, గ్యాస్ పొయ్యి ఉచితంగా అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం లబ్ధిదారులను (PMUY beneficiaries) ఉద్దేశించి మాట్లాడనున్నారు.
2016లో తొలిసారిగా ఉజ్వల 1.0 కార్యక్రమం ప్రారంభించినప్పుడు దేశవ్యాప్తంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఐదు కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్స్ అందివ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత 2018లో ఈ పథకాన్ని విస్తరిస్తూ మరో ఏడు కేటగిరీలకు చెందిన మహిళలకు ఈ ప్రయోజనం వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఉజ్వల 1.0 లక్ష్యాన్ని సవరిస్తూ మొత్తం 8 కోట్ల మంది నిరుపేద మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం (PMUY scheme) వర్తించేలా చేశారు. 2019 ఆగస్టులో.. అంటే లక్ష్యాన్ని చేరుకునేందుకు మరో ఏడు నెలల వ్యవధి మిగిలి ఉండగానే పథకం లక్ష్యం నెరవేరడం విశేషం.
Also read : Indane gas connection: ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు..ఇంటి వద్దకే గ్యాస్ కనెక్షన్ ఏర్పాటు
ఉజ్వల 2.0 లక్ష్యంలో భాగంగా ఈసారి కోటి మందికి ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్స్ (LPG) అందించనున్నట్టు 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలోనే కేంద్రం ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ధిప్ సింగ్ పురి, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Also read : PM KISAN scheme money credited: రైతులకు శుభవార్త....పీఎం-కిసాన్ నిధులు విడుదల..చెక్ చేసుకోండి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook