PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

PM Kisan Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 13వ విడత నగదు కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు 12 విడతలు రైతుల ఖాతాలో నగదు జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే 13వ విడతకు సబంధించిన డబ్బులు వేయనుంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల జాబితాలో మీరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 12:39 PM IST
PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

PM Kisan Scheme: రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఒకటి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ పథకం కింద వచ్చిన మొత్తాన్ని నేరుగా రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు 12 విడతల్లో రైతులకు నగదు అందజేసింది. మరికొద్ది రోజుల్లో పీఎం కిసాన్ స్కీమ్ 13వ విడత కూడా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమకాబోతుంది. అయితే 13వ విడత డబ్బులు మీకు వస్తాయా లేదా అనుమానం ఉందా..? అయితే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి.

రైతులకు మరింత లబ్ధి చేకూరే విధంగా 2019లో  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.6 వేల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం సుమారు 11 కోట్ల మంది రైతులకు రూ.2.2 లక్షల కోట్ల మొత్తం నగదు బదిలీ చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తెలిపారు.

లబ్ధిదారుల జాబితాలో మీరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

- పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.inకి వెళ్లండి 
- హోమ్ పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' ఎంపికకు వెళ్లండి. 
- రైతుల కార్నర్ మెను నుండి లబ్ధిదారుల జాబితా ఎంపికను ఎంచుకోండి. 
- డ్రాప్-డౌన్ మెను నుంచి రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, గ్రామాన్ని ఎంచుకోండి. 
- 'గెట్ రిపోర్ట్' ఎంచుకోండి. 
- పైభాగంలో మీ పేరుతో పాటుగా లబ్ధిదారులందరి జాబితా కనిపిస్తుంది.

ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నెంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు సంప్రదించాలి. అది కాకుండా pmkisan-ict@gov.in కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.

Also Read: IND Vs AUS: ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి   

Also Read: Pervez Musharraf: బిగ్ బ్రేకింగ్.. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ కన్నుమూత  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News