రాయ్‌పూర్: తెలంగాణకు పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘడ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు కొంతమేరకు తగ్గనున్నాయి. తాజాగా జరిగిన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర కేబినెట్ భేటీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్‌పై 2 శాతం, పెట్రోల్‌పై 1 శాతం వ్యాట్ తగ్గించాలని భూపేష్ బఘేల్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఛత్తీస్‌ఘడ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి.
ఇటీవల పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కొంతమేరకు వ్యాట్ తగ్గించుకుని వాహనదారులపై ఆర్థికభారం పడకుండా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా నవంబర్ 3న ప్రధాని మోదీ సర్కారు ఈ ప్రకటన చేసింది.
#CabinetUpdates
मुख्यमंत्री श्री @bhupeshbaghel द्वारा #छत्तीसगढ़ की जनता को बड़ी राहत देते हुए कैबिनेट में लिए गए महत्वपूर्ण निर्णय -
🔻पेट्रोल में VAT पर 1% की कमी की गयी
🔻 राज्य सरकार वहन करेगी लगभग रु. 1000 करोड़ का घाटा (2/2)— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) November 22, 2021
Also read : వెళ్తున్న ట్రక్కులోంచి కిందపడిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్నోళ్లకు ఏరుకున్నంత.. వైరల్ వీడియో
కేంద్రం పిలుపు మేరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ని తగ్గించగా.. తాజాగా ఆ రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌ఘడ్ కూడా వచ్చిచేరింది. కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన అనంతరం రెండు వారాల వ్యవధిలో చత్తీస్‌ఘడ్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 1000 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ట్వీట్ చేసింది.
కేంద్రం పిలుపు అనంతరం కూడా వ్యాట్ తగ్గించని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. త్వరలోనే ఇంకొన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలుపై వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా త్వరలోనే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also read : గూగుల్ పేలో కొత్త ఫీచర్.. వాయిస్ కమాండ్‌తో మనీ ట్రాన్స్ ఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook