ఆ వీడియోలో నిజం లేదు.. మీ డేటాకు డోకా లేదు : పేటీఎం

థర్డ్ పార్టీలకు డేటా షేరింగ్‌పై పేటీఎం వివరణ

Last Updated : May 27, 2018, 05:12 PM IST
ఆ వీడియోలో నిజం లేదు.. మీ డేటాకు డోకా లేదు : పేటీఎం

పేటీఎం సంస్థ తన వినియోగదారుల సమాచారాన్ని థర్డ్ పార్టీలకు అమ్ముకుంటోంది అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆ సంస్థ స్పందించింది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న ఆ వీడియోలో ఏ మాత్రం వాస్తవం లేదని తీవ్రంగా ఖండించిన పేటీఎం సంస్థ.. వినియోగదారుల డేటాకు ఎటువంటి డోకా లేదని ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ ట్వీట్ చేసిన పేటీఎం సంస్థ.. వినియోగదారుల సమాచారం 100 శాతం భద్రంగా వుందని, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దర్యాప్తు సంస్థలతో తప్పించి ఇంకెవ్వరితోనూ ఆ సమాచారాన్ని పంచుకోవడం జరగలేదని పేటీఎం ఈ ట్వీట్‌లో పేర్కొంది. 

 

ఇటీవల పలు సంస్థలు తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్ పార్టీలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో డిజిటల్ మనీ వ్యాలెట్‌గా ఎంతో మంది భారతీయులకు చేరువైన పేటీఎం కూడా థర్డ్‌ పార్టీలకు తమ వినియోగదారుల సమాచారాన్ని అమ్ముకుని భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటోందనే ఆరోపణలు వినిపించాయి. అందుకు ఇదే ఆధారం అంటూ ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే తాజాగా పేటీఎం వివరణాత్మకంగా ఈ ట్వీట్ చేసింది. 

Trending News