పద్మ అవార్డుల ప్రకటన.. ఐదుగురు తెలుగు వారికి పద్మ అవార్డులు

71వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని 2020వ సంవత్సరానికిగాను శనివారం కేంద్ర ప్రభుత్వం ఉన్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందిని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులకు ఎంపిక చేసింది.

Last Updated : Jan 26, 2020, 12:10 AM IST
పద్మ అవార్డుల ప్రకటన.. ఐదుగురు తెలుగు వారికి పద్మ అవార్డులు

న్యూఢిల్లీ : 71వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని 2020వ సంవత్సరానికిగాను శనివారం కేంద్ర ప్రభుత్వం ఉన్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందిని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులకు ఎంపిక చేసినట్టు తమ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డుగ్రహీతలకు అవార్డులు అందజేయనున్నారు. ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరిని ఈ పద్మ అవార్డులు వరించాయి. 

తెలంగాణ నుంచి క్రీడా విభాగంలో పీవీ సింధుకు పద్మ భూషణ్‌ను ప్రకటించగా.. వ్యవసాయ రంగంలో తెలంగాణకు చెందిన చింతల వెంకట్ రెడ్డికి పద్మశ్రీ , విద్య-సాహిత్య రంగాల్లో విశేష సేవలు అందించిన విజయసారధి శ్రీభాష్యంకు పద్మశ్రీ అవార్డు వరించాయి. కళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యడ్ల గోపాల రావు, దలవాయి చలపతి రావులకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.

Trending News