ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలలో సోమవారం రోజు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగు పాటుకు 30 మందికి పైగా మృతి చెందారు. ఓ వైపు ఎండలు ఉండగానే .. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడగా.. పలుచోట్ల జనజీవనం స్తంభించింది. వర్ష భీభత్సానికి చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడిపోయాయి.
బీహార్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా 17 మంది మృతి చెందారు. జార్ఖండ్‌లో పిడుగుపాటుకు 12 మంది మృతి చెందగా.. 28 మందికి గాయాలయ్యాయి. 9 మంది యూపీలో మృతి చెందారు.
12 people dead, 28 injured due to thunderstorm in different parts of Jharkhand. More details awaited pic.twitter.com/3a6OllNKRP
— ANI (@ANI) May 29, 2018
17 people dead due to thunderstorm in different parts of #Bihar.
— ANI (@ANI) May 29, 2018
కాగా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో నేడు అధిక ఉష్ణోగ్రతలతో పాటు మరొకొన్ని చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు నైరుతి రుతుపవనాలు రాకతో కేరళ, కర్ణాటక తీరాలలో నేడు భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం ఉత్తర భారతంలోని ఖజురహోలో దేశంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనధికారికంగా ఇది 49 డిగ్రీలపైనే ఉంటుందని తెలిసింది.
పిడుగులతో 30 మందికి పైగా మృతి