Onion Prices Today: ప్రస్తుతం మండుతున్న ఉలి ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు నగరాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఢిల్లీలో ఉల్లి రిటైల్ ధర కిలో రూ.80కి లభిస్తుండగా.. నేడు రూ.90కి చేరింది. హైదరాబాద్ వంటి నగరాల్లో రూ.60 నుంచి రూ.80 వరకు కిలో అమ్మకాలు జరుగుతున్నాయి. కర్నాటక, మహారాష్ట్రల్లో వర్షాలు ఆలస్యంగా కురిశాయి. దీంతో ఖరీఫ్ పంటలు ఆలస్యమై మార్కెట్‌లోకి కొత్త ఉల్లి వచ్చేందుకు సమయం పడుతోంది. అందుకే ఉల్లి ధరలు పెరగడానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఇక గతంలో రాజకీయాలపై ఉల్లి ధరలు పెద్ద ప్రభావమే చూపించాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఉల్లి దండ మెడలో వేసుకుని నిరసనలు కూడా చేపట్టారు. ఢిల్లీలో ఉల్లిధరల కారణంగా షీలా దీక్షిత్ అధికారంలోకి రాగా.. సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఉల్లి తన సత్తా చూపించినప్పుడు.. పేరు మోసిన రాజకీయ నాయకులు కూడా మోకరిల్లాల్సి వచ్చింది.
అది 1980వ సంవత్సరం. ఆ సమయంలో మన దేశ ప్రధానిగా చౌదరి చరణ్ సింగ్ ఉన్నారు. ఆ సమయంలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. ఉల్లి ధరలను నియంత్రించడంలో ప్రధాని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ధరలపై నియంత్రణలేని ప్రభుత్వానికి దేశాన్ని నడిపే హక్కు లేదని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా బహిరంగ సభల్లో ఉల్లిపాయ దండలు వేసుకుని నిరసనలు తెలిపారు. అప్పట్లో ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా భావించే సీఎం స్టీఫెన్ కూడా ఉల్లి దండ వేసుకుని పార్లమెంటుకు హాజరయ్యారు.
పార్లమెంట్‌లో కూడా ఉల్లి ధరలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే ఏడాది ఉల్లి ధరలను ఇందిరా గాంధీ ఎన్నికల అంశంగా మార్చారు. 1980 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి.. మళ్లీ అధికారంలోకి వచ్చారు. తన కొత్త ప్రభుత్వంలో ఇందిరా గాంధీ ఉల్లిని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన సీఎం స్టీఫెన్‌కు కమ్యూనికేషన్స్ మంత్రి పదవిని అప్పటించారు ఇందిరా గాంధీ. ఆమె ప్రధానిగా అధికారం చేపట్టగానే.."ఉల్లిపాయ ఇందిరాగాంధీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చింది.." అమెరికా వాషింగ్టన్ పోస్ట్ వార్తను ప్రచురించింది. సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు ఢిల్లీలో షీలా దీక్షిత్ కూడా అదే ఫార్ములాను పాటించారు. కాంగ్రెస్ ఎన్నికల అంశంగా మార్చడంతో సుష్మా ప్రభుత్వం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయ్యారు.
Also Read: Kerala Blast: కేరళలో భారీ పేలుడు, ఒకరి మృతి, 40 మందికి గాయాలు, రాష్ట్రమంతటా అలర్ట్
Also Read: Nagam Janardhan Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నాగం జనార్థన్ రెడ్డి రాజీనామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook