Omicron Variant Twice: ఒకే వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎన్నిసార్లు సోకుతుందో తెలుసా..?

Omicron Variant Twice: దేశంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న కరోనా మూడో వేవ్ లోనూ అనేక మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు కరోనా సోకింది. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కూడా రెండో సారి సోకే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై పరిశోధకులు ఏమన్నారంటే?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 06:40 PM IST
    • ప్రజల్లో భయాందోళనలు గుప్పిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్
    • ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ సార్లు సోకే అవకాశం
    • ఒమిక్రాన్ వ్యాప్తి నియంత్రణ తప్పదని అంటున్న పరిశోధకులు
Omicron Variant Twice: ఒకే వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎన్నిసార్లు సోకుతుందో తెలుసా..?

Omicron Variant Twice: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజువారి నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య మూడున్నర లక్షలు దాటింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని పరిశోధకులు అంటున్నారు. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వ్యాప్తి చాలా విస్త్రతంగా ఉందని.. ఇన్ఫెక్షన్ పరంగా ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. 

అయితే ఒమిక్రాన్ వేరియంట్ తో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే.. ఈ మహమ్మారి శరీరంలోని యాంటీబాడీల (వ్యాధి నిరోధకాల) బారి నుంచి సులభంగా తప్పించుకుంటుంది. వ్యాక్సినేషన్ ద్వారా శరీరంలో కొత్తగా తయారైన యాంటీబాడీలను సైతం ఇది ఎదుర్కొంటుందని పరిశోధకులు పలుమార్లు వెల్లడించారు. అందుకే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. అనేక మంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడుతున్నారని అభిప్రాయపడ్డారు. 

ఒక వ్యక్తికి ఎన్నిసార్లు ఒమిక్రాన్ సోకవచ్చు?

కరోనా వైరస్ మొదటి వేవ్ నుంచి ప్రస్తుతం మూడో వేవ్ వరకు అనేక మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు కరోనా బారిన పడిన వారు కూడా ఉన్నారు. అదే విధంగా ఒకే వ్యక్తికి రెండుసార్లు డెల్టా ఇన్ఫెక్షన్ సోకిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 

ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒక వ్యక్తికి ఎన్ని సార్లు సోకుతుంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం.. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం 4 రెట్లు ఎక్కువ అని తేలింది. అలాంటి పరిస్థితుల్లో ఒకే వ్యక్తికి రెండు సార్లు ఒమిక్రాన్ సోకే అవకాశం లేకపోలేదని పరిశోధకుల వాదన. 

ఒమిక్రాన్ వేరియంట్ కు శరీరంలోని ప్రతిరోధకాలను ఓడించే సామర్థ్యం కలిగి ఉంది. కాబట్టి.. ఒమిక్రాన్ వైరస్ రూపాంతరం చెందే అవకాశం ఉంది. దీంతో కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారితో పాటు ఇప్పటికే కరోనా బారిన పడివారు కూడా సులభంగా ఒమిక్రాన్ సోకే అవకాశం ఉంది. 

ఒమిక్రాన్ నుంచి బయటపడేందుకు మార్గాలు

ప్రభుత్వం జారీ చేసిన సలహాలు, సూచనలు పాటించడం సహా ఒమిక్రాన్ వ్యాప్తిని నివారించేందుకు బయటకు రాకపోవడమే మంచిది. అవసరాల కోసం బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా డబుల్ మాస్క్ వినియోగించడం మర్చిపోకండి. చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవాలి. ఆహారం తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. చేతులతో కళ్లు, నోరు లేదా ముఖాన్ని మళ్లీ మళ్లీ తాకకుండా జాగ్రత్తలు వహించండి.

(నోట్: సాధారణ సమాచారం ఆధారంగా ఈ వార్తను పొందుపరచడం జరిగింది. దీన్ని పాటించే ముందు కచ్చితంగా వైద్య సలహా తీసుకోవడం మంచిది. ZEE తెలుగు News దీన్ని ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Aloe For Weight Loss: స్థూలకాయులకు గుడ్ న్యూస్- ఈ చిట్కాతో వెంటనే బరువు తగొచ్చు!

Also Read: Corona Symptoms in Kids: కరోనా సోకిన పిల్లల్లో రెండు కొత్త లక్షణాలు- ముందే జాగ్రత్త పడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News