Nitin Gadkari News: రానున్న రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గుతాయి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Nitin Gadkari News: రాబోయే రెండేళ్లలో పెట్రోల్ తో నడిచే వాహనాలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తామని పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పెట్రోల్ వాహనాలకు రూ. 100 వెచ్చించే వారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు రూ. 10 ఖర్చు చేసే పరిస్థితి వస్తుందని అన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2022, 07:23 PM IST
Nitin Gadkari News: రానున్న రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గుతాయి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Nitin Gadkari News: కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ వేదికగా మంగళవారం కీలక ప్రకటన చేశారు. దేశంలో టెక్నాలజీ, గ్రీన్ ఫ్యూయల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధర తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. రానున్న రెండేళ్లలో పెట్రోల్ తో నడిచే వాహనాలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తామని స్పష్టం చేశారు. లోక్ సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఈ విధంగా స్పందించారు. 

వాహనాలకు ఇంధనం కోసం స్వదేశీ ఉత్పత్తలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గ్రీన్ ఫ్యూయల్ త్వరలోనే పూర్తిగా వినియోగంలోకి వస్తుందని.. తద్వారా వాతావరణంలో కాలుష్య స్థాయి తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ ఫ్యూయల్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను వినియోగించడం వల్ల ఢిల్లీలో కాలుష్య పరిస్థితి పూర్తిగా మెరుగవుతుందని అన్నారు. 

అయితే పార్లమెంట్ సభ్యులందరూ.. మురుగు నీటితో గ్రీన్ హైడ్రోజన్ తయారీని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. గ్రీన్ హైడ్రోజన్ త్వరలోనే చౌకైన ఇంధన ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆయన తెలిపారు. 

రానున్న రెండేళ్లలో ఎలక్ట్రిక్ స్కూటర్, కారు, ఆటోరిక్షాల ధర.. పెట్రోల్ తో నడిచే వాటితో సమానంగా ఉంటుందని నేను చెప్పగలను. ఎందుకంటే బ్యాటరీలను తయారు చేసే లిథియం - అయాన్ బ్యాటరీల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో పాటు మేము జింక్ కెమిస్ట్రీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. అదే జరిగితే రెండేళ్ల తర్వాత పెట్రోల్ ధర లీటరు కు రూ.100 ఉంటే ఎలక్ట్రిక్ వాహనానికి కేవలం రూ. 10 ఖర్చు చేసే రోజులు వస్తాయ"ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.  

Also Read: Stalin Accident Scheme: రోడ్ యాక్సిడెంట్ బాధితులకు సహాయం చేస్తే రూ.5 వేల బహుమానం!

Also Read: Lalu Yadav Health: మరింతగా క్షీణించిన లాలూ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News