Balakrishna Padma Bhushan: రాజకీయాల్లో మిత్రులుగా ఉన్నవాళ్లు తమ అవసరాల రీత్యా శత్రువులుగా మారిపోతుంటారు. 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామిగా తెలుగు దేశం పార్టీ.. కేంద్రం అప్పట్లో కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదన్నారు. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దాన్ని ముందుగా స్వాగించిన చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత అప్పటి రాజకీయాల కారణంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుపట్టి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగింది. ఆ తర్వాత జరిగిన ఓ సభలో బాలకృష్ణ.. ప్రధాని మోడీని ఎవరు అనకూడని పచ్చి పరుష పదజాలంతో ఆయన్ని దూషించారు.
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీని బాలయ్య తిట్టినట్టు బహుశా ప్రధానిని తీవ్రంగా వ్యతిరేకించే ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా తిట్టి ఉండరు. అప్పట్లో తనను తీవ్రంగా దూషించిన బాలకృష్ణను.. అవేమి ప్రధాని నరేంద్ర మోడీ మనసులో పెట్టుకోకుండా.. పెద్ద మనసుతో క్షమించి బాలకృష్ణను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. అయితే.. ఆ తర్వాత బాలయ్య..ప్రధానిని తీవ్రంగా దూషించినందుకు తన సన్నిహితుల వద్ద పశ్చాతాపం వ్యక్తం చేశారట. గతం గత: అన్నట్లు .. బాలయ్య సినీ రంగంలో 50 యేళ్లకు పైగా కథానాయకుడిగా రాణిస్తున్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఒక నట వారసుడిగా.. అడుగుపెట్టి ఇప్పటికీ హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటున్న సినీ వారసుడు బహుశా ప్రపంచంలో ఎవరు లేరు. ఓ రకంగా బాలయ్య నట వారస హీరోల్లో ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. బాలయ్య సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా.. చేస్తోన్న సేవలకు గుర్తిస్తూ 2025 యేడాదికి గాను బాలయ్యను పద్మభూషణ్ తో గౌరవించడం సబబే అంటున్నారు కామన్ సినీ ప్రేక్షకులు. మొత్తంగా అప్పట్లో ప్రధాని మోడీని తిట్టినా.. ఆయనకు ఈ అవార్డు వరించడాన్ని అందరు ముక్కున వేలేసుకొని ఔరా.. తిట్టిన వాళ్లతో గౌరవించబడటం బాలయ్య విషయంలోనే జరిగిందనుకుంటూ ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.