భారతీయ వైద్యులకు ఆదర్శమూర్తి 'బిసి రాయ్'

ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినా.. అంతకు మించి ఓ గొప్ప వైద్యునిగానే ప్రజల మన్ననలు పొందారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా,  చిత్తరంజన్ సేవాసదన్  వ్యవస్థాపకునిగా... అంతకు మించి గొప్ప మానవతావాదిగా పేరుగాంచిన ఆయన జయంతినే జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఆయనే బిధాన్ చంద్ర రాయ్. బిసి రాయ్‌గా ప్రాచుర్యం పొందిన ఆయన జయంతి సందర్భంగా ఈ వ్యాసం జీ న్యూస్ పాఠకులకు ప్రత్యేకం

Last Updated : Jul 1, 2018, 09:40 PM IST

*1 జులై 1882 సంవత్సరంలో పాట్నా జిల్లాలోని బంకింపూర్‍‍లో ప్రకాశ్ చంద్ర, అఘోర్ కామినిదేవి దంపతులకు జన్మించిన బిసి రాయ్ కలకత్తా మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసించారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్‌‌లోని సెంట్ బెర్త్ లోమో కళాశాలలో చేరారు. 1911 సంవత్సరంలో భారతదేశానికి తిరిగివచ్చి కలకత్తా వైద్య కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. 

*భారతదేశంలో ఆధునిక వైద్యం మీద ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువగా ఆసుపత్రులు నెలకొల్పడానికి శ్రీకారం చుట్టారు బిసి రాయ్. జాదవ్ పూర్ టి.బి.హాస్పిటల్, ఆర్.జి.ఖార్ మెడికల్ కాలేజీ, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ మొదలైనవి అన్నీ కూడా రాయ్ చేసిన కృషి ఫలితంగానే నెలకొల్పబడ్డాయి.

*1922లో కలకత్తా మెడికల్ జర్నల్‌కు సంపాదక బాధ్యతలు స్వీకరించిన రాయ్, ఆ తర్వాత రాజధాని నగర ప్రజలకు బాగా దగ్గరై.. వారి ప్రోద్బలంతో మేయరుగా కూడా ఎన్నికయ్యారు. 1933 ప్రాంతంలో మహాత్మాగాంధీకి వ్యక్తిగత వైద్యునిగా కూడా రాయ్ వ్యవహరించారు. 

*1925 సంవత్సరంలో రాయ్ తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. బరక్ పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన సురేంద్రనాథ్ బెనర్జీ వంటి గొప్ప నాయకుడిని ఓడించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అనేకమందిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

*స్వాతంత్ర్యం వచ్చాక, కాంగ్రెస్ బిసి రాయ్ పేరును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించింది. ప్రఫుల్ల చంద్ర ఘోష్ పదవీ కాలం ముగిశాక.. బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా రాయ్ బాధ్యతలు స్వీకరించారు. 

*మత ఘర్షణలతో, నిరుద్యోగంతో అప్పటికే సతమతమవుతున్న బెంగాల్‌ను రాయ్ తనదైన శైలిలో పాలించారు. ప్రజలను కార్యోన్ముఖులను చేయడానికి ప్రయత్నించారు. 4 ఫిబ్రవరి, 1961 తేదిన రాయ్‌కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది. 

*జులై 1, 1962 తేదిన రాయ్ మరణించారు. అయితే.. తాను మరణించడానికే ముందే ఆయన తన ఇంటిని పేదవారి కోసం ఆసుపత్రి నిర్మించేందుకు దానం చేశారు. 1976 నుండి భారతప్రభుత్వం బిసి రాయ్ పేరు మీద వైద్యం, రాజకీయాలు, సైన్స్, తత్వశాస్త్రం, సాహిత్యం, ఆర్ట్స్ రంగాల్లో అవార్డులు ఇవ్వడానికి సంకల్పించింది.

Trending News