mp santosh kumar in gir national park: గిర్ అభయారణ్యంలో రిఫ్రెష్ అయిన ఎంపీ సంతోష్‌కుమార్

mp santosh kumar in gir national park: ప్రకృతిప్రేమికుడు ఎంపీ సంతోష్ కుమార్ ను ఎంతగానో ఆకట్టుకున్న గిరిజనులు. వారితో కలిసి సెల్ఫీలు తీసుకున్న పార్లమెంటు సభ్యులు

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 04:23 PM IST
  • గిర్ అభయారణ్యంలో పర్యటించిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ
    గిరిజనులతో కలిసి ఆటాపాటా
    పార్లమెంటు సభ్యులను ఆకట్టుకున్న జీవనవిధానం
mp santosh kumar in gir national park: గిర్ అభయారణ్యంలో రిఫ్రెష్ అయిన ఎంపీ సంతోష్‌కుమార్

mp santosh kumar in gir national park: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎంపీ సంతోష్‌కుమార్. ప్రతి ఒక్కరూ ఒక మొక్కనాటి మరో ముగ్గుర్ని నామినేట్ చేయాలనే కాన్సెప్ట్ తో ప్రారంభమైన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ విరామం లేకుండా కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖ రాజకీయనేతలు, సినీ, ఇతర రంగాల సెలబ్రెటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ఎన్నో విజయాలను సాధించి పలువురి ప్రశంసలు పొందింది.

స్వతహాగా ప్రకృతిప్రేమికుడైన ఎంపీ సంతోష్ కుమార్ ... పర్యావరణం పై అమతమైన ఆసక్తి చూపిస్తారు. అందులో భాగంగానే సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ కమిటీ ప్రస్తుతం గిర్ అభయారణ్యంలో స్టడీ టూర్ నిర్వహిస్తోంది. పర్యటనలో భాగంగా మల్దారీస్ అనే గిరిజనులతో మమేకమైంది కమిటీ. వారితో కలిసి ఆడిపాడింది. అడవిలో వారు సాగిస్తున్న జీవన విధానాన్ని చూసి ఆశ్చర్యానికి గురైంది.

ప్రకృతి నియమాలను గౌరవిస్తే అడవి జంతువులతో కూడా హాయిగా జీవించొచ్చని మాల్దారీస్ గిరిజనులు నిరూపించారని ఎంపీ సంతోష్ కుమార్ అభిప్రాయపడ్దారు. వారి ఆచారం , సంస్కృతి తమను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. స్టాండింగ్ కమిటీ ముందు మాల్దారిస్ గిరిజనులు తమ జానపద పాటలను పాడి వినిపించారు. ఈ పాటలు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎంతో ఆకట్టుకున్నాయి. మాల్దారీలు తమ జానపద పాటలు పాడుతున్నప్పుడు వారి ముఖాల్లో ఎంతో సంతోషం కనిపించిందన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ దృశ్యం చూసి తమ మనసు పొంగిపోయిందన్నారు. ఇది కాదా రిఫ్రెష్ అని తమ టూర్ తాలూకూ ఫోటోలను షేర్ చేస్తూ ఎంపీ సంతోష్ ట్వీట్ చేశారు. 

 

 

 

ఎంపీ సంతోష్ ట్వీట్ ను మెచ్చుకుంటూ పలువురు నెటిజన్లు రిప్లే ఇస్తున్నారు. ప్రకృతితో కలిసి జీవిస్తే చాలా సమస్యలు దూరమవుతాయన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్టడీటూర్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

also read: Hero Siddharth: 'ప్యాన్ ఇండియా' అనే పదమే నాన్‌సెన్స్... హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు 

 

also read: Google banned: మోసపూరిత యాప్‌లపై ఇక చెక్‌యేనా..గూగుల్ కీలక నిర్ణయం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News