Glamorous Women Politicians in India: డింపుల్ యాదవ్: డింపుల్ యాదవ్ ఎవరో కాదు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్యనే. ప్రస్తుతం ఈమె ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్ సభ నుంచి పార్లమెంట్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
మహువా మొయిత్రా: మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్లోని క్రిష్ణానగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మహిళా పొలిటిషియన్లలో మొయిత్రా కూడా ఒకరు. 2016 నుంచి 2019 వరకు కరీంపూర్ నియోజకవర్గం నుంచి వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన మహువా మొయిత్రా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు.
మిమి చక్రవర్తి: మిమి చక్రవర్తి వెస్ట్ బెంగాల్లోని జాదవ్‌పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మోడల్‌గా కెరీర్ ఆరంభించి ఆ తరువాత సినీ నటిగా మారిన మిమి చక్రవర్తి.. 2019 లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున జాదవ్‌పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.
నవనీత్ కౌర్ రానా: తెలుగు వారికి ఎంతో సుపరిచితమైన పేరు ఇది. హీరోయిన్‌గా ఆమె ఎక్కువ సినిమాలు చేసింది ఇక్కడే. మళయాళం ఇండస్ట్రీతో సినిమాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్.. ఆ తరువాత తెలుగు సినిమాలతో బీజీ అయ్యారు. మహారాష్ట్రకు చెందిన రవి రానా అనే ఎన్సీపీ నేతను పెళ్లి చేసుకోవడంతో ఆమె నవనీత్ రానా అయ్యారు. 2014 లోనే మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఆమె.. 2019 లో అదే స్థానం నుంచి అదే ఎంపీని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఓడించి లోక్ సభలో అడుగుపెట్టారు.
నుస్రత్ జహాన్: 2019 లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సినిమా ఇండస్ట్రీ నుంచి బరిలోకి దింపిన ఉమెన్ పొలిటిషియన్స్‌లో నుస్రత్ జహాన్ కూడా ఒకరు. బసిర్‌హత్ లోక్ సభ స్థానం నుంచి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2019 జూన్ 19న టర్కీలో బిజినెస్ మేన్ నిఖిల్ జైన్‌ని పెళ్లి చేసుకున్న ఆమె ఆ తరవాత ఆ పెళ్లి చట్టపరంగా చెల్లదని నిఖిల్ జైన్‌తో తన బంధం కేవలం సహ జీవనమే అవుతుంది అని ప్రకటించారు. కోర్టు సైతం ఆ పెళ్లి చట్టబద్ధంగా చెల్లదు అని ప్రకటించింది. అనంతరం నటుడు యశ్ దాస్ గుప్తాతో సహ జీవనం ప్రారంభించారు. 2021 ఆగస్టులో ఆమె ఓ పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఆ బాబు బర్త్ సర్టిఫికెట్ రికార్డ్సులో తండ్రి పేరు స్థానంలో యశ్ దాస్ గుప్తా పేరుతో నమోదు చేశారు.
ప్రియాంకా చతుర్వేది: మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రియాంకా చతుర్వేది అంతకంటే ముందుగా ఫేమస్ కాలమిస్టుగా పేరు సంపాదించుకున్నారు. తెహెల్కా, డైలీ న్యూస్ ఎనాలసిస్, ఫస్ట్ పోస్ట్ వంటి మీడియా సంస్థలకు ఆమె రెగ్యులర్ కాలమిస్టుగా కొనసాగారు. ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న జాబితా అంతా ప్రస్తుతం పార్లమెంట్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్న కొంతమంది జాబితా మాత్రమే. పూర్తి జాబితా చాలా పెద్దదే ఉంది. ఇదే కాకుండా గతంలోనూ పార్లమెంట్‌లో అడుగుపెట్టి ప్రజాసేవలో తరించిన గ్లామరస్ లేడీస్ జాబితా ఇంకా పెద్దదే ఉంది.
ఇది కూడా చదవండి : Realme Smartphone: రూ. 17 వేల ఫోన్ కేవలం రూ. 1149 కే.. సూపర్ డీల్ కదా..
ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు
ఇది కూడా చదవండి : Best Selling Hatchbacks Cars: ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook