Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన కొనసాగుతోంది. బికనీర్, కోటా, రైసెన్, రాయ్‌పూర్, దిఘా మీదుగా ఆగ్నేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఆవర్తనం ఏర్పడింది. తాజాగా ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది.
సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. వీటితోపాటు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈనెల 7న వాయవ్య బంగాళాఖాతం, ఆనుకున్న ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాగల మూడురోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
రాగల మూడురోజులపాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురవనున్నాయి. రాబోయే మూడు రోజులపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవన ద్రోణి, ఆవర్తనం, అల్పపీడనం ప్రభావం అధికంగా ఉంది.
వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు వానలు పడనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. తీరం వెంట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి, విశాఖ వాతావరణ శాఖలు వెల్లడించాయి. పెనుగాలులు సైతం ఉంటాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Daily Weather Video (Hindi) 05.08.2022:
Youtube link: https://t.co/oVNLhPcLQM
Facebook link: https://t.co/hRzdTa9EeA
— India Meteorological Department (@Indiametdept) August 5, 2022
Also read:TS Govt: సిజేరియన్లు తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!
Also read:Dasoju Sravan: తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ..పార్టీ వీడిన సీనియర్ నేత..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook