మీటూ ఎఫెక్ట్: కేంద్రమంత్రి ఎంజే అక్బర్ రాజీనామా

ఈ మధ్యకాలంలో ‘మీటూ’ ఉద్యమం చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్ట్ ప్రియా రమణి.. కేంద్రమంత్రి ఎంజే అక్బర్ పై ఆరోపణలు చేశారు. 

Last Updated : Oct 18, 2018, 04:19 PM IST
మీటూ ఎఫెక్ట్: కేంద్రమంత్రి ఎంజే అక్బర్ రాజీనామా

ఈ మధ్యకాలంలో ‘మీటూ’ ఉద్యమం చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్ట్ ప్రియా రమణి.. కేంద్రమంత్రి ఎంజే అక్బర్ పై ఆరోపణలు చేశారు. పాత్రికేయునిగా పనిచేస్తున్న రోజుల్లో అక్బర్ పలువురు మహిళలను వేధించారని తెలిపారు. ప్రియా రమణి నోరు విప్పాక.. మరో 15 మంది మహిళలు కూడా అక్బర్ పై ఫిర్యాదు చేశారు. తాము కూడా గతంలో ఆయన చేత వేధింపులకు గురయ్యామని తెలిపారు. అయితే ఈ ఆరోపణలు అన్ని కూడా అవాస్తవాలని.. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తన పరువు తీసే ఉద్దేశంతో పలువురు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అక్బర్ తెలిపారు. అలాగే తాను ప్రియా రమణి పై కేసు కూడా పెడుతున్నట్లు తెలిపారు.

పటియాలా కోర్టులో పరువునష్ట దావా వేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే అక్బర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పలు  మహిళా సంఘాలు డిమాండ్ చేయడంతో.. ఈ రోజు తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎంజే అక్బర్ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆ పదవికి రాజీనామా చేసినట్లు ఈ రోజే కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను  విడుదల చేసింది. 

ఎంజే అక్బర్ రాజకీయాల్లోకి రాకముందే ఆసియన్ ఏజ్ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. అలా సంపాదకుడిగా వ్యవహరిస్తున్న సమయంలోనే ఆయన పలువురిని లైంగిక వేధింపులకు గురిచేశారని.. అందులో తాను కూడా ఒకరినని ప్రియా రమణి ఇటీవలే తెలిపారు. అయితే అక్బర్ ఆమె పై పరువు నష్టదావా వేయడంతో పలువురు మహిళా జర్నలిస్టులు ఆమెకు మద్దతు తెలిపారు. అక్బర్ తమను వేధించాడని.. ఈ కేసు విషయంలో తమ వాంగ్మూలాన్ని కూడా న్యాయస్థానం రికార్డు చేయాలని వారు తెలిపారు. ఈ క్రమంలో తన నైతిక బాధ్యతగా పదవికి రాజీనామా చేయాలని అక్బర్‌ని ప్రతిపక్షాలు కోరడంతో ఆయన ఈ రోజు తన పదవికి రాజీనామా చేశారు. 

Trending News