Rs 1.8Cr for Corona Treatment: కరోనా చికిత్సకు రూ. కోటీ 80 లక్షలు వసూలు చేసిన మాక్స్ హాస్పిటల్

కరోనా వ్యాధిని అడ్డం పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ బాగానే దండుకొంతున్నాయి. కొత్తగా ఢిల్లీ మాక్స్ హాస్పిటల్ లో ఏకంగా 1.8 కోట్ల  రూపాయలను బిల్లు వేసింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..??

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2021, 06:46 PM IST
  • కారోనా చికిత్సకు 1.8 కోట్ల రూపాయల బిల్లు...
  • బిల్లును చూసి ఆశ్చర్యపోతున్న సామాన్య ప్రజలు
  • ఆసుపత్రి యాజమాన్యంపై మండిపడుతున్న రాజకీయ నాయకులు
Rs 1.8Cr for Corona Treatment: కరోనా చికిత్సకు రూ. కోటీ 80 లక్షలు వసూలు చేసిన మాక్స్ హాస్పిటల్

Rs 1.8cr Covid treatment bill: కరోనా (Corona Virus) వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. లాక్ డౌన్ (Lock Down) కారణంగా కొంతం మంది ఉపాధి కోల్పోతే కొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఆసుపత్రుల విషానికి వస్తే చాలా వరకు ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుండి భారీగా దండుకున్న ఘటనలు చాలా వరకే చూసాము. 

భారీగా బిల్లులు వేయటమే కాకుండా, డబ్బు కట్టనిదే మృతదేహాలను ఇవ్వని ప్రైవేటు ఆసుపత్రులను చూసాము.. ప్రస్తుతం ఇలాంటి ఒక ఘటనే ఒకటి డిల్లీలో (Delhi) వెలుగులో చూసింది. అదేంటంటే.. ఒక ప్రైవేటు ఆసుపత్రి కరోనా రోగికి నుండి ఏకంగా అక్షరాల 1.8 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 

Also Read: PAPK 28: "దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్".. పవన్ ఫస్ట్ లుక్ అదుర్స్..!

అవును నిజం.. ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్ (Max Hospital in Delhi) ఒక కరోనా (Corona) రోగికి చికిత్స అందించి వారి నుండి  1.8కోట్ల రూపాయలను వసులు చేసింది. ఈ విషయం వెలుగులోకి రావటంతో కాంగ్రెస్‌ ఎంపీ మనీష్ తివారీ (Congress MP Manish Tewari)"కరోనా చికిత్సకి 1.8 బిల్లు ఎలా అవుతుంది..?? రోగి నుండి ఆసుపత్రి యాజమాన్యం ఇంత మొత్తం ఎలా వాసులు చేస్తుంది..?? దీనిపైన పూర్తీ విచారణ జరపాలని మరియు తగిన చర్యలు తీసుకోవాలని" ప్రభుత్వాన్ని ఆయన డిమాడ్ చేసారు.  అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అధికారులను నియమించి విచారణ జరపాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయాకు (Health Minister Mansukh Mandaviya) లేక రాశారు. ఇలాంటివి జరగకుండా ఉండటానికి ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను(CM Kejriwal) కోరారు.

Also Read: Nusrat Jahan : మీ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పండి?.. నటి షాకింగ్ రిప్లై

ఈ సంఘటనపై ఆమ్-ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మాళవ్య నగర్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి (MLA Somnath Bharti)మాక్స్ హాస్పిటల్ పై తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ ఘటనపై సామాన్యులతో పాటు పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. 

దీనిపై స్పందించిన మాక్స్ హాస్పిటల్ యాజమాన్యం (Max Hospital Management) కరోనా చికిత్స కోసం సదరు వ్యక్తి  ఏప్రిల్ లో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, దాదాపు నాలుగు నెలల పాటు చికిత్స అందించామని తెలిపారు. అంతేకాకుండా, ఆ రోగికి హైపర్‌టెన్షన్ (hypertension), పిత్తాశయం ఇన్ఫెక్షన్ (Gall Blader Infections), టైప్ -2 డయాబెటిక్ (Type 2 Diabetes) మరియు మెదడు పని తీరు మందగించటం వలన వ్యక్తి  ప్రాణాల కోసం చాలా శ్రమించామని మరియు రోగికి అన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించటం వలన ఆ మేరకు ఖర్చు అయిందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.

Also Read: India Corona Update: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా ఉధృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News