'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా వ్యాప్తి చెందింది. ఇందులో సగానికి కంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు తబ్లీగీ జమాత్ సభ్యుల వల్లే నమోదయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అసలు తబ్లీగీ జమాత్ సభ్యులను బయటకు ఎవరు పంపించారనే చర్చ జరుగుతోంది.
ఐతే అందుకు కారణమైన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు నిన్న (శుక్రవారం) అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు మౌలానా గులామ్ సర్వర్. ఆల్ ఇండియా ముస్లిం ఫ్రంట్ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నాడు. అంతే కాదు ఆల్ ఇండియా ముస్లిం దళిత్ మోర్చా పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. ఇప్పుడు దానికి కార్యదర్శిగానూ పని చేస్తున్నాడు.
తబ్లీగీ జమాత్ మత ప్రార్థనలు జరిగిన తర్వాత .. ఢిల్లీ మసీదు నుంచి 15 మందిని తరలించాడు. ఇందుకోసం అతడు మీడియా పాస్ ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో జీ మీడియా స్టింగ్ ఆపరేష్ కూడా నిర్వహించింది. ఇప్పుడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని 9 గంటలు ప్రశ్నించారు. పోలీసుల విచారణలో మౌలానా గులామ్ సర్వర్.. సరిగ్గా సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఏ ప్రశ్న అడిగినా.. అన్నింటికీ కోర్టులోనే సమాధానం చెబుతానన్నట్లు సమాచారం.
గతంలో జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌలానా గులామ్ సర్వర్.. తాను 15 మంది పారిపోయేందుకు సహకరించానని ఒప్పుకున్నాడు. అంతే కాదు.. అల్లా శాపం కారణంగానే కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించిందంటూ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలోని ఏ ఏ దేశాల్లో ప్రజలు అణచివేతకు గురవుతున్నారో ఆయా దేశాల్లోనే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందటూ చెప్పాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..