Blast in Nashik: మహారాష్ట్రలోని నాసిక్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాసిక్-ముంబై హైవేపై ఉన్న గొండే గ్రామంలోని జిందాల్ కంపెనీలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ కంపెనీకి చెందిన బాయిలర్ పేలిపోయి భారీగా శబ్దం వచ్చింది. దీని ప్రభావం 20 నుంచి 25 గ్రామాలపై పడింది.
ఈ కంపెనీ క్లోజ్డ్ ఏరియాలో ఉండడంతో పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన వారిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికక్కడే మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నారు.
జిల్లా కలెక్టర్ గంగాధరన్, పోలీస్ ఎస్పీ షాహాజీ ఉమాప్ సహా పలువురు సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నాయని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలోని ముడిసరుకు రకం కారణంగా మంటలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో మంటలను అదుపు చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. గాయపడిన వారికి, లోపల చిక్కుకున్న వారికి అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. తాను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన 14 మందిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Nashik Factory Fire: నాసిక్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 14 మందికి గాయాలు