Housing Loan Interest: మీ సిబిల్ స్కోరు ఎంత ఉంది, ఎల్ఐసీ నుంచి అతి తక్కువ వడ్డీకే గృహరుణం

Housing Loan Interest: కొత్త ఇళ్లు కొనాలనుకునేవారికి ఇది కచ్చితంగా శుభవార్తే. సిబిల్ స్కోర్ బాగుంటే అదిరిపోయే గుడ్‌న్యూస్ అందిస్తోంది ఎల్ఐసీ. ఆకర్షణీయమైన వడ్డీకే రుణమందించేందుకు ముందుకొస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందామా

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 12, 2021, 10:25 PM IST
  • ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి అతి గొప్ప ఆఫర్
  • అతి తక్కువ వడ్డీ రేటు 6.90 శాతానికే గృహ రుణాలు
  • సిబిల్ స్కోర్ 7 వందల కంటే ఎక్కువుంటే అతి తక్కువ వడ్డీకే రుణం
Housing Loan Interest: మీ సిబిల్ స్కోరు ఎంత ఉంది, ఎల్ఐసీ నుంచి అతి తక్కువ వడ్డీకే గృహరుణం

Housing Loan Interest: కొత్త ఇళ్లు కొనాలనుకునేవారికి ఇది కచ్చితంగా శుభవార్తే. సిబిల్ స్కోర్ బాగుంటే అదిరిపోయే గుడ్‌న్యూస్ అందిస్తోంది ఎల్ఐసీ. ఆకర్షణీయమైన వడ్డీకే రుణమందించేందుకు ముందుకొస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందామా

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(Lic Housing Finance)మీకు అద్బుతమైన ఆఫర్ ఇస్తోంది. సిబిల్ స్కోర్‌ని బట్టి  హౌసింగ్ లోన్ విషయంలో మెరుగైన ఆఫర్ అందిస్తోంది. మీ సిబిల్ స్కోర్ 7 వందల కంటే ఎక్కువుంటే తక్కువ వడ్డీరేటులో గృహ రుణాలు అందించనుంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్తగా గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారి కోసం వడ్డీ రేటును ఏకంగా 6.90 శాతానికి తగ్గించింది. గృహ రుణాలపై ఇప్పటి వరకూ అందిస్తున్న అతి తక్కువ వడ్డీరేటు ఇదే. మీ సిబిల్ స్కోరు 7 వందలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ తక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. 

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకారం సిబిల్ స్కోరు(Cibil Score) 7 వందలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాదారులకు 50 లక్షల రుణంపై వడ్డీరేటు 6.90 శాతంతో ప్రారంభం కానుంది. 7 వందల కంటే ఎక్కువ స్కోరున్న వినియోగదారులకు 80 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే 7 శాతం వడ్డీరేటు పడనుంది. ఒక వ్యక్తి ఇంతకు ముందు రుణం తీసుకున్నాడా, రుణం తీసుకున్నట్లయితే సకాలంలో చెల్లించాడా లేదా అనేదానిపై ఆధారపడే సిబిల్ స్కోరు ఉంటుంది. ఈ సిబిల్ స్కోరే ఇప్పుడు మీకు తక్కువ వడ్డీరేటుతో రుణాన్ని అందిస్తుంది. మరింకేం. మీ సిబిల్ స్కోరు 7 వందల కంటే ఎక్కువుంటే మాత్రం కచ్చితంగా తక్కువ వడ్డీరేటుకు ఎల్ఐసీ అందించే హౌసింగ్ లోన్(Housing loan with lowest interest rate) కోసం త్వరపడండి. 

Also read: Cibil Score: సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలి, అనుసరించాల్సిన సులభమైన సూచనలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News