Rain Alert: కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..రాగల మూడురోజులు బీఅలర్ట్..!

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. దీంతో మరోమారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Jul 25, 2022, 02:10 PM IST
  • తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన
  • ఉపరితల ఆవర్తనం ప్రభావం
  • కొన్ని చోట్ల భారీ వర్షాలు
Rain Alert: కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..రాగల మూడురోజులు బీఅలర్ట్..!

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన కొనసాగుతోంది. నిన్న ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ ఆగ్నేయ మధ్య ప్రదేశ్‌, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
రేపు, ఎల్లుండి అనేక చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇందులోభాగంగా ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు నారాయణపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలోనూ ఉపరితల ఆవర్తన ప్రభావం అధికంగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. సముద్ర తీరం పెను గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి.

Also read:Monkeypox India: దేశంలో మంకీపాక్స్ కలకలం.. లక్షణాలు ఏంటి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Also read:Governor Tamili Sai: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాకపోవచ్చు..గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News