శబరిమల వివాదంపై కేరళ ముఖ్యమంత్రి విజయన్ స్పందించారు. అందరికీ అయ్యప్ప దర్శనం కల్గించడమే మా బాధ్యత అంటూ మహిళల ఆలయ ప్రవేశాన్ని సమర్ధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రవేశానికి మహిళలను అడ్డుకుంటే కోర్టు ధిక్కరణే అవుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో సర్కార్ తో ఘర్షణకు దిగడం సరికాదు ఆందోళనకారులకు హితవుపలికారు. ఈ విషయంలో ఎలాంటి పరిణామాలమైనా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. శాంతిభద్రతల సమస్యను పోలీసులు చూసుకుంటారు. శబరిమల అంశాన్ని రాజకీయం చేయడమ మానుకోవాలని ఆందోళనలో భాగస్వామిగా ఉన్న బీజేపీ శ్రేణులకు సూచించారు. శాంతిభద్రత చర్యల్లో భాగంగా కేరళ వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో పోలీసులను తరలించినట్లు విజయన్ వెల్లడించారు
హింసాత్మకంగా మారుతున్న వివాదం
శబరిమలలో 50 ఏళ్ల లోపు వయసు కలిగిన ఇద్దరు మహిళలు ఆలయంలో ప్రవేశించడంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సాంప్రదాయవాదులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వారికి భద్రత కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేరళ వాప్తంగా రాస్తా రోకోలు, ధర్నాలు చేపడుతున్నారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించారు. బంద్ ప్రభావంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఆందోళనకారుల దాడుల్లో 60 బస్సులు ధ్వంసమైనట్లు సమాచారం. వండలం ప్రాంతంలో చెలరేరగిన ఘర్షణ ఒకరి మృతి చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శబరిమల వివాదం నేపథ్యంలో కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం వియయన్ ఈ మేరకు స్పందించారు