Kashmiri Pandits Protests: జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బుద్గాంలోని చందూరాలో రాహుల్ భట్ అనే పండిట్ హత్యను నిరసిస్తూ కశ్మీరీ పండిట్లు రోడ్డెక్కారు. కశ్మీర్లో పండిట్లకు రక్షణ కరువైందని... తమకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బుద్గాంలో నిరసన ప్రదర్శన చేపట్టిన పండిట్లు.. స్థానిక ఎయిర్పోర్ట్ వైపు ర్యాలీగా కదిలారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా.. ఇరువరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో లాఠీచార్జి జరిపిన పోలీసులు ఆందోళనకారులు చెదరగొట్టారు. భాష్ప వాయువు ప్రయోగించారు. నిరసనకారులు తమపై రాళ్లు రువ్వడం వల్లే లాఠీఛార్జి జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బుద్గాంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.
శుక్రవారం (మే 13) ఉదయం 11 గంటలకు వరకు లెఫ్టినెంట్ గవర్నర్ వస్తారని ఎదురుచూశామని... ఆయన రాకపోయేసరికి నిరసన చేపట్టామని నిరసనకారులు తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ రావాల్సిందేనని తాము అధికారులతో చెప్పామన్నారు. ఆయన వచ్చి తమ ప్రాణాలకు రక్షణ కల్పిస్తామనే భరోసా కల్పించాలని... రాహుల్ భట్ హంతకులను వదిలిపెట్టమనే హామీ ఇవ్వాలని అధికారులతో చెప్పినట్లు తెలిపారు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ రాకపోవడంతో తాము నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఎయిర్పోర్ట్ వరకు ర్యాలీగా బయలుదేరిన తమను పోలీసులు అడ్డుకున్నట్లు చెప్పారు.
రాహుల్ భట్‌ను హత్య చేసిన ఉగ్రవాదులు :
బుద్గాంలోని చందూరా తహసీల్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న రాహుల్ భట్‌ను గురువారం (మే 12) ఉగ్రవాదులు కాల్చి చంపారు. తహసీల్ కార్యాలయంలోకి చొరబడి ఆయన్ను హత్య చేశారు. రాహుల్ భట్ హత్యతో కశ్మీర్ పండిట్లలో ఆగ్రహావేశాలు రాజుకున్నాయి. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పండిట్లు నిరసనలకు దిగారు. కశ్మీర్లో తమకు రక్షణ కరువైందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం తమకు రక్షణ కల్పించడంలో విఫలమవుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం తమకు తగిన రక్షణ కల్పించకపోతే మూకుమ్ముడి రాజీనామాలకు సిద్ధమని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న పండిట్లు కేంద్రాన్ని హెచ్చరించారు. శుక్రవారం (మే 13) జరిగిన రాహుల్ భట్ అంత్యక్రియలకు కశ్మీర్ పండిట్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Massive protests by Kashmiri Pandit Hindus in Kashmir over the killing of #RahulBhat by Islamist terrorists. Apathy from the central govt. State admin fires tear gas shells on them. Pandits are raising slogans against @BJP4India PM @narendramodi & to resign from jobs en masse. pic.twitter.com/gdEI1eIScx
— Aarti Tikoo (@AartiTikoo) May 13, 2022
#WATCH Government employees and families of Kashmiri Pandits living in the Kashmir Valley protest against the LG administration over the targeted killing of Kashmiri Pandit govt employee Rahut Bhat, in Budgam pic.twitter.com/8XXClAypai
— ANI (@ANI) May 13, 2022
Also Read: Si Sucide: సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య, పోలీసుల విచారణ షురూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook