/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Kiccha Sudeep Comments on Joining BJP: కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మేనెలలో ఎన్నికలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు కన్నడ నటుడు దర్శన్ సైతం బీజేపీలో చేరనున్నాడని తెలుస్తోంది. అయితే ఏది నిజం, ఎంతవరకూ నిజమనేది పరిశీలిద్దాం.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సినీ గ్లామర్ వాడుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొందరు వివిధ పార్టీల కండువాలు కప్పుకుంటున్న పరిస్థితి ఉంది. తాజాగా కన్నడ నటులు కిచ్చా సుదీప్, దర్శన్‌లు బీజేపీలో చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. కిచ్చా సుదీప్ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే కాకుండా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు కావడంతో అతని చేరిక లాభిస్తుందనే ఆలోచనలో పార్టీ ఉంది.  ఇక మరో నటుడు దర్శన్ ఇప్పటికే 202లో ఆర్ఆర్ నగర్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేశారు. అంబరీష్ మరణానంతరం మాండ్యా లోక్‌సభ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా సుమలత పోటీ చేసినప్పుడు కూడా దర్శన్ ప్రచారం చేశాడు. 

మద్దతు బొమ్మైకు మాత్రమే..బీజేపీకు కాదు

కిచ్చా సుదీప్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారని, తనకు మద్దతు తెలిపారని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై మీడియా సమావేశంలో వెల్లడించారు. దాంతో బీజేపీలో చేరినట్టు, ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారనే ప్రచారం సాగింది. ఆ తరువాత సుదీప్ దీనిపై స్పష్టత ఇచ్చారు. బసవరాజ్ బొమ్మై నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా మద్దతు ఆయనకే. కష్టకాలంలో నాకు అండగా నిలిచినవారికి నేను పనిచేస్తాను. నేను రాజకీయాల్లోకి రావడం లేదు, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుదీప్ స్పష్టం చేశారు. తాను మద్దతిచ్చేది కేవలం బసవరాజ్ బొమ్మైకు మాత్రమేనని..బీజేపీకు కాదని కూడా తెలిపారు. బసవరాజ్ బొమ్మై తరపున ప్రచారం, సభలు నిర్వహిస్తాను కానీ బీజేపీకు మద్దతు కాదని వివరణ ఇచ్చారు.

Also Read: Threatening Letters to Star Hero: 'ప్రైవేట్ వీడియోలు పోస్ట్ చేస్తా'.. పొలిటికల్ ఎంట్రీ రోజే కిచ్చ సుదీప్ కి బెదిరింపులు

నాకు మద్దతు అంటే బీజేపీకు మద్దతు ఇచ్చినట్టేగా

అటు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఈ విషయంపై మరోలా స్పందించారు. ఆయన అంటే కిచ్చా సుదీప్ నాకు మద్దతు పలికారు. నాకు మద్దతు ఇస్తున్నారంటే బీజేపీకు మద్దతు ఇస్తున్నట్టే కదా కదా అని వ్యాఖ్యానించారు. 

Also Read: Covid19 Cases in India: దేశంలో కరోనా కలకలం, 24 గంటల్లో 4వేలకుపైగా కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Section: 
English Title: 
Karnataka star actor kiccha sudeep clears on joining bjp says he supports to cm bommai but not bjp
News Source: 
Home Title: 

Kiccha Sudeep Comments: నేను BJPకి మద్దతు ఇవ్వడం లేదు.. స్పష్టత ఇచ్చిన కన్నడ నటుడు కిచ్చా సుదీప్

Kiccha Sudeep Comments: నేను BJPకి మద్దతు ఇవ్వడం లేదు.. స్పష్టత ఇచ్చిన కన్నడ నటుడు కిచ్చా సుదీప్
Caption: 
Kiccha Sudeep Clarify on Joining BJP(File Photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
నేను BJPకి మద్దతు ఇవ్వడం లేదు.. స్పష్టత ఇచ్చిన కన్నడ నటుడు కిచ్చా సుదీప్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Wednesday, April 5, 2023 - 15:00
Created By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
68
Is Breaking News: 
No
Word Count: 
292