Karnataka: రేపే కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం, ఎవరెవరికి ఆహ్వానం, ఎవరికి నో

Karnataka: కర్ణాటకలో కొత్త ప్రభుత్వ రేపు కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరగనుంది. దేశవ్యాప్తంగా వివిధ పార్టీ నేతలు, ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 19, 2023, 11:00 AM IST
Karnataka: రేపే కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం, ఎవరెవరికి ఆహ్వానం, ఎవరికి నో

Karnataka: ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లను కైవసం చేసుకోగా బీజేపీ 66 సీట్లకు పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. ఇక జేడీఎస్ కేవలం 19 స్థానాలే దక్కించుకుంది. సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ పోటీలో చివరికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. రేపు మద్యాహ్నం 12.30 గంటలకు అత్యంత ఘనంగా ప్రమాణ స్వీకారం జరగనుంది.

రేపు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డికే శివకుమార్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘనంగా నిర్వహించతలపెట్టింది. దేశవ్యాప్తంగా భావసారూప్యత కలిగిన పార్టీ నేతలను, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. ప్రమాణ స్వీకారానికి హేమంత్ సోరేన్, సీతారాం ఏచూరి, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్, కేసీఆర్, మమతా బెనర్డీ వంటి నేతలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మాత్రం ఆహ్వానించలేదు. 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకు ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న కేసీఆర్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. రేపు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా గాంధీ కుటుంబం హాజరుకానుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ హాజరుకానున్నారు. 

రేపు మద్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో ప్రమాణ స్వీకారం ఉంటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జి పరమేశ్వర ఆ పార్టీ ప్రతినిధిగా ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కలిశారు. అటు సిద్ధరామయ్య సైతం ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు బెంగళూరులో శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్యను ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ను నిర్ణయించింది. మరోవైపు వచ్చే పార్లమంట్ ఎన్నికల వరకూ పార్టీ పగ్గాలు కూడా డీకే శివకుమార్ చేతిలోనే ఉంటాయి. రేపటి ప్రమాణ స్వీకారోత్సవంలో కొందరు మంత్రులు కూడా ఉంటారు. 

రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి అందరినీ ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించలేదు. ఇంకా జగన్‌తో వైరి కొనసాగిస్తోంది గాంధీ కుటుంబం. కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపించారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

Also read: Jallikattu: తమిళనాడు ప్రభుత్వానికి ఊరట.. జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News