kanpur encounter case: ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని బిక్రు గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది పోలీసులను అతి దారుణంగా హత్యచేసిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ( Gangster Vikas Dubey ) ఆచూకీ మూడు రోజులు గడిచినా లభించలేదు. ఇది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వందకిపైగా పోలీసు బృందాలు యూపీతోపాటు, మధ్యప్రదేశ్, నేపాల్ సరిహద్దు, రాజస్తాన్‌లో కూడా విస్తృతంగా గాలిస్తున్నా ఆచూకీ లభించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఈ గ్యాంగ్‌స్టర్ తలపై ఉన్న రివార్డును పెంచాలని కాన్పూర్ ఐజీ డీజీపీ ఫైల్‌ను పంపారు. దానిని వెంటనే ఆమోదించి ఆ రివార్డును లక్ష నుంచి ఏకంగా రెండున్నర లక్షలకు పెంచుతున్నట్లు యూపీ డీజీపీ హెచ్‌సీ అవస్థీ ప్రకటించారు. Also read: Kanpur encounter case: కాన్పూర్ ఎన్కౌంటర్ కేసులో అనేక అనుమానాలు
అణువణువు గాలిస్తున్నా.. దొరకని దూబే..
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను పట్టుకోవడానికి వందకిపైగా పోలీసు బృందాలు రాష్ట్రంతోపాటు పక్కరాష్ట్రాల్లో కూడా అణువణువు గాలిస్తున్నాయి. వందలాది మంది పోలీసులు దూబే కోసం 24గంటలు వెతుకుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద కూడా దూబే ఫొటోలను అంటించారు. అయితే సంఘటన జరిగిన నాటి నుంచి పోలీసు అధికారులు నిత్యం బిక్రు గ్రామానికి చేరుకోని నేరస్థుల నేర చరిత్ర, ఆధారాలను సేకరిస్తున్నా.. దూబే జాడ పసిగట్టలేకపోవడం గమనార్హం. Also read: UP encounter: యూపీలో దుండగుల కాల్పులు.. డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి
ఇంకో ముగ్గురు పోలీసుల సస్పెండ్..
గ్యాంగ్‌స్టర్ దూబేకు సన్నిహితంగా ఉండే మరో ముగ్గురు పోలీసులపై వేటుపడింది. వీరిలో ఇద్దరు ఎస్ఐలు, కానిస్టేబుల్ ఉన్నారు. అంతకుముందు దూబేకు ముందే సమాచారాన్ని లీక్ చేశాడని చౌబేపూర్ స్టేషన్ ఆఫీసర్ వినయ్ తివారిని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఈ పోలీసులపై కేసులు కూడా నమోదు చేశారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..