Tamil nadu: మూడవ కూటమి కోసం కమల్ హాసన్ ప్రయత్నాలు

Tamil nadu: తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రముఖ నటుడు  రజినీకాంత్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మూడవ కూటమి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Last Updated : Dec 29, 2020, 01:25 PM IST
Tamil nadu: మూడవ కూటమి కోసం కమల్ హాసన్ ప్రయత్నాలు

Tamil nadu: తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రముఖ నటుడు  రజినీకాంత్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మూడవ కూటమి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ( Tamil nadu Assembly Elections ) ఇప్పుడు సందడి ప్రారంభమైంది. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ( Kamal haasan ) ప్రచారం ముమ్మరం చేశారు. ఓ వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు మూడవ కూటమి దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. జనవరి నెలలో పొత్తు విషయాన్ని ప్రకటిస్తామని చెప్పిన కమల్ హాసన్..మరో సంచలన విషయం వెల్లడించారు.

మూడవ కూటమి ( Third Alliance ) ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్ధి ( Cm candidate ) తానేనని చెప్పుకున్నారు. ఇప్పటికే రెండు విడతల ప్రచారం ముగించిన కమల్ హాసన్..మూడవ విడత ప్రచారాన్ని తిరుచ్చి నుంచి మొదలు పెట్టారు. ప్రత్యేక హెలీకాప్టర్‌లో తిరుచ్చి వెళ్లి..సుడిగాలి పర్యటన నిర్వహించారు. మహిళా సంఘాలు, విద్యార్ధులు, పారిశ్రామిక వేత్తలు, రైతులు అందరినీ కలుసుకున్నారు. రాష్ట్రంలో మూడవ ప్రధాన పార్టీ తమదేనని కమల్ హాసన్ తెలిపారు. రజినీకాంత్ ఆరోగ్యం తమకు చాలా ముఖ్యమని కమల్ హాసన్ వెల్లడించారు. 

రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోందని..దివంగత నేత ఎంజీఆర్‌ ( MGR ) తరహాలో అవినీతి రాయుళ్లపై కొరడా ఝుళిపించేందుకు ఈ పాలకులు సిద్ధమా అని ప్రశ్నించారు.  ఏయే పనులకు ఎంత లంచం ఇవ్వాల్సి వస్తుందనే జాబితాను కమల్ హాసన్ విడుదల చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

Also read: New coronavirus strain: ఇండియాలో కొత్త వైరస్ స్ట్రెయిన్ కేసులు ఆ మూడు రాష్ట్రాల్నించే..ఏపీ సంగతేంటి

Trending News