JEE Main Results 2021: జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధం, రిజల్ట్ ఇలా చేసుకోండి

JEE Main Results 2021 February | ఫిబ్రవరి నెలలో నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 7, 2021, 07:04 PM IST
  • నేడు ఫలితాలు నేడు విడుదల అయ్యే అవకాశం ఉంది
  • ఫలితాల విడుదలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సర్వం సిద్ధం చేసిందని సమాచారం
  • అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచనున్న ఎన్‌టీఏ
JEE Main Results 2021: జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధం, రిజల్ట్ ఇలా చేసుకోండి

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021 (JEE Main Result 2021) ఫలితాలు నేడు విడుదల అయ్యే అవకాశం ఉంది. పలు జాతీయ మీడియాలు సైతం ఫిబ్రవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయని రిపోర్ట్ చేశాయి. ఫలితాల విడుదలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సర్వం సిద్ధం చేసిందని సమాచారం.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవాలని ఇప్పటికే ప్రకటించారు. గత నెలలో జేఈఈ మెయిన్ 2021 పరీక్ష నిర్వహించడం తెలిసిందే. ఈ ఏడాది నాలుగు పర్యాయాలు జేఈఈ మెయిన్స్ నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ జనవరి నెలలో ప్రకటించారు. నేడు జేఈఈ మెయిన్ ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ లో ఫలితాలు, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Also Read: WhatsApp Privacy Policy అంగీకరించకపోతే వినియోగదారులకు వాట్సాప్ సేవలు బంద్

ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2021(JEE Main 2021)లో భాగంగా ఫిబ్రవరిలో తొలి పరీక్ష నిర్వహించారు. మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలోనూ మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ సైతం ఏర్పాట్లు చేశారు. మెయిన్ పర్సంటైల్ స్కో, పర్సంటైల్ ర్యాంక్‌ను స్కోరు లేదా పర్సంటైల్ ర్యాంక్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయనుంది. ఆరుగురు విద్యార్థుల మార్కుల ఆధారంగా 100 శాతం పర్సంటైల్ ర్యాంకును ప్రకటిస్తారు. 

Also Read: JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీల ప్రకటనపై అప్‌డేట్

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 పరీక్షా ఫలితాలు విడుదల చేసిన తరువాత కటాఫ్ మార్కులు ప్రకటించనున్నారు. మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం కల్పించడంతో పాటు నెగటివ్ మార్కులను సైతం తొలగించారు. 11 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News