ఆర్థిక మందగమం నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్ధిక, వాణిజ్య విధానంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇన్ కమ్స్ టాక్స్ విధానంలో స్వల్ప మార్పు చేర్పులు చేశారు . అక్టోబర్ 1 నుంచి కేంద్రీకృత విధానంలో ఆదాయ పన్ను నోటీసులు ఇస్తామని ప్రకటించారు. ASESIకు అనుగుణంగానే పన్నుల విభాగం పనిచేస్తుందని ఆర్దిక మంత్రి వెల్లడించారు.
మూడు నెలల్లోనే అన్ని కేసులు పరిష్కారం
డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు ( డీఐఎన్) లేకుండా ఎలాంటి ఐటీ నోటీసులూ ఉండవని పేర్కొన్నారు. నోటీసులు అందిన మూడు నెలల్లోనే అన్ని కేసులు పరిష్కారమవుతాయి. డీఐఎన్ లేని నోటీసులకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ అధికారీ సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు అని ఈ సందర్భంగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
రెపోరేటుకు అనుగుణంగానే గృహ, వాహన రుణాలు
ఈ సందర్భగా నిర్మాల సీతారామన్ మాట్లాడుతూ ఇకపై రెపోరేటుకు అనుగుణంగానే గృహ, వాహన రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో గృహ, వాహన రుణాలపై భారం తగ్గతాయన్న ఆర్ధిక మంత్రి.. గృహ, వాహన రుణాల వాయిదాలు అనుసంధానమవుతాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందని పేర్కొన్నారు. సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. అలాగే సూపర్ రిచ్ సర్‌ఛార్జి నుంచి విదేశీ సంస్థాగత మదుపరులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.
జీఎస్టీ ఫైలింగ్ లో మార్పులు
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆర్ధిక క్రమ శిక్షణ చర్యలో భాగంగా జీఎస్టీని మరింత సులభతరం చేస్తామన్నారు. జీఎస్టీ ఫైలింగ్ లోని ఇబ్బందులను తొలగిస్తామని తెలిపారు. రానున్న జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటామని నిర్మలా తెలిపారు.