Independence day 2020: ఆగస్టు 15న దాడులకు ఐఎస్ఐ భారీ కుట్ర

Terror attacks in Ayodhya: ఆగస్టు 15న అయోధ్యలోని రామ జన్మభూమిలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్‌కి చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర చేస్తోందని భారత నిఘావర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.

Last Updated : Jul 28, 2020, 04:31 PM IST
Independence day 2020: ఆగస్టు 15న దాడులకు ఐఎస్ఐ భారీ కుట్ర

Terror attacks in Ayodhya: ఆగస్టు 15న అయోధ్యలోని రామ జన్మభూమిలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్‌కి చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర చేస్తోందని భారత నిఘావర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. అయోధ్యలో ఉగ్రవాద దాడులకు పాల్పడటం కోసం ఐఎస్ఐ ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రత్యేకంగా లష్కర్, జైషే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్టు భారత నిఘా సంస్థ రా (R&AW) వెల్లడించింది. 3 నుంచి 5 బృందాలను ఈ దాడుల కోసం పంపించేందుకు ఐఎస్ఐ ఏర్పాట్లు చేసుకుంటోంది. భారత్‌లోని అంతర్గత శక్తులే ఈ దాడికి పాల్పడ్డాయని భావించేలా ఈ దాడి జరపాలని పాకిస్తాన్ కుట్ర పన్నుతున్నట్టు నిఘావర్గాలు తేల్చిచెప్పాయి. అయోధ్య స్థల వివాదం ( Ayodhya land dispute ) ముగిసిన నేపథ్యంలో మరోసారి ఆ వివాదం రాజుకునేలా భారత్‌లో మతకల్లోలం రేపడమే పాకిస్తాన్ కుట్ర వెనుక ఉన్న ముఖ్య లక్షణం అని నిఘావర్గాలు తెలిపాయి.  Also read: Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్

అయోధ్యలో ఎవరైనా ప్రముఖుడిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగే అవకాశం ఉందని.. తద్వారా ఉగ్రవాద దాడి ప్రభావం అధికంగా కనిపించేలా చేయాలనేది వారి ఆలోచనగా తెలుస్తోందని రా పేర్కొంది. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్య, ఢిల్లీ, కశ్మీర్‌లో ఇప్పటికే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనుమానితుల కదలికలపై కన్నేసి పెట్టాయి. Also read: Ram Mandir: టైమ్ క్యాప్సుల్‌ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది?

ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం భూమి పూజ ( Ram temple bhoomi puja ) జరగనుంది. వేడుకగా జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. యాదృశ్చికంగా 2019లో జమ్మూకశ్మీర్‌లో Article 370 రద్దు చేసింది కూడా ఇదే రోజు కావడం గమనార్హం. Also read: Pulwama like attack: మరో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. రెక్కీ పూర్తి

Trending News