భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ( Ministry of Civil Aviation ) 17 దేశాలకు విమాన ప్రయాణం చేయడానికి ప్రత్యేక ఎయిర్ బబుల్ అగ్రీమెంట్ ( Air Bubble Agreement) చేసుకుంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ దేశానికి ప్రయాణించడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది.
ALSO READ | LPG Gas: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి!
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రారంభం అయిన తరువాత లాక్ డౌన్ అయిన ప్రపంచం మొత్తం మళ్లీ సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విమానాలు ( International Flights ) మెల్లిమెల్లిగా మొదలవుతున్నాయి. దీని కోసం వివిధ దేశాలు ట్రాన్స్ పోర్ట్ బబుల్ లేదా ఎయిర్ ట్రావెల్ అరేంజ్ మెంట్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో ఒప్పందం చేసుకునే ఇరు దేశాలు లబ్ది పొందుతాయి.
ఉక్రెయిన్ వెళ్లాలి అంటే .
- భారతీయులు లేదా సీఐఎస్ దేశాలకు చెందిన వారు అయి ఉండాలి. ఇందులో రష్యా దేశస్తులకు అనుమతి లేదు.
- ఉక్రెయిన్ ( Ukraine ) వెళ్లడానికి డిప్లమాటిక్ పాస్ పోర్టు లేదా అధికారిక పాస్ పోర్టు ఉండాలి. సీఐఎస్ దేశాల అధికారిక పాస్ పోర్టు ఉన్నా సరిపోతుంది.
- భారత దేశం నుంచి ఉక్రెయిన్ కు వెళ్లాలి అనుకునే వారికి బోర్డింగ్ వద్ద ఎలాంటి సమస్య ఉండకుండా ఇరు దేశాల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు.
ALSO READ | చీరకట్టులో మెరిసిపోతున్న Hebah Patel, ది అందాల భామ
ఉక్రెయిన్ నుంచి ఇండియాకు రావాలి అంటే
- సీఐఎస్ దేశాల జాబితాలో ఉన్న భారతీయులు ( రష్యా దేశానికి మినహాయింపు )
- ఉక్రెయిన్ ప్రభుత్వం జారీ చేసిన ఓవర్సీస్ సిటిజన్స్ కు అనుమతి ఉంటుంది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR