India: 37 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి.

Last Updated : Sep 2, 2020, 10:12 AM IST
India: 37 లక్షలు దాటిన కరోనా కేసులు

Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. అయితే.. గత 24 గంటల్లో మంగళవారం ( సెప్టెంబరు 1న ) దేశవ్యాప్తంగా కొత్తగా 78,357 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,045 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( Health Ministry ) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,69,524 కు పెరగగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా 66,333 మంది చనిపోయారు. Also read: Pawan Kalyan: వారి మరణం మాటలకు అందని విషాదం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,01,282 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 29,01,909 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 10,12,367 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. సెప్టెంబరు 1 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,43,37,201 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.   Also read : పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో తీవ్ర అపశృతి.. ముగ్గురు అభిమానులు మృతి

Trending News