Railway jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1,40,640 ఉద్యోగాలు

నిరుద్యోగులకు త్వరలోనే రైల్వేలో ఉద్యోగాల రూపంలో భారతీయ రైల్వే ( Indian Railways ) నుంచి గుడ్ న్యూస్ రానుంది. రైల్వేలో లాక్‌డౌన్ కంటే ముందుగా 1,40,640 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ( Railway jobs notification ).. లాక్‌డౌన్ కారణంగా ఆ పరీక్షలు వాయిదా పడ్డాయి.

Last Updated : Sep 5, 2020, 08:38 PM IST
  • రైల్వేలో ఉద్యోగాలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కి సంబంధించిన పనులు వేగవంతం.
  • డిసెంబర్ 15 నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు
  • 1,40,640 ఉద్యోగాలకు దాదాపు 2.42 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు
  • త్వరలోనే పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల
Railway jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1,40,640 ఉద్యోగాలు

న్యూ ఢిల్లీ: నిరుద్యోగులకు త్వరలోనే రైల్వేలో ఉద్యోగాల రూపంలో భారతీయ రైల్వే ( Indian Railways ) నుంచి గుడ్ న్యూస్ రానుంది. రైల్వేలో లాక్‌డౌన్ కంటే ముందుగా 1,40,640 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ( Railway jobs notification ).. లాక్‌డౌన్ కారణంగా ఆ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇండియన్ రైల్వేలో మూడు కేటగిరీలకు సంబంధించిన ఖాళీలను ( Vacancies in Railways ) భర్తీ చేసేందుకు అప్పట్లో నోటిఫికేషన్ విడుదల చేయగా.. దాదాపు 2.42 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసిన రైల్వే శాఖ.. తాజాగా వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. Also read : Pawan Kalyan in web series: పవన్ కల్యాణ్ వెబ్‌సిరీస్ చేస్తారా ?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 15 నుంచి రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. Also read : F3 Movie: F3 మూవీ ఎక్కడివరకు వచ్చింది ? లేటెస్ట్ అప్‌డేట్స్..

Trending News