Railway Jobs in Telugu: ఇండియన్ రైల్వేస్‌లో భారీగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. గ్రూప్ డి పోస్టుల కోసం ఇండియన్ రైల్వేస్ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 32 వేల ఖాళీల భర్తీకై దరఖాస్తు ప్రక్రియ ఇవాళ జనవరి 23 నుంచి ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారతీయ రైల్వేలో పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ జరగనుంది. మొత్తం 32, 438 ఖాళీల్ని భర్తీ చేసేందుకు జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉంటుంది. పదో తరగతి ఉత్తీర్ణులయినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఆర్ఆర్‌బి అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/ సందర్శించాలి.
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్టంగా 36 ఏళ్లుండాలి. రిజర్వ్ కేటగరీ అభ్యర్ధులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది. కనీస, గరిష్ట వయస్సు జనవరి 1, 2025 నాటికి లెక్కిస్తారు. అయితే మనిషి శరీర దారుఢ్యం అవసరం. పురుషులు 35 కిలోల బరువుతో 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. 1000 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే మహిళలయితే 20 కిలోల బరువుతో 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. 1000 మీటర్ల దూరాన్ని5 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఇవాళ్టి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించవచ్చు. ముందుగా అప్లికేషన్ నింపి నిర్ణీత ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు అయితే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఈబీసీ కేటగరీ విద్యార్ధులకు , మహిళలకు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి.
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే డివిజన్లలో ఈ రిక్రూట్‌మెంట్ జరగనుంది. రెండు రకాల పరీక్షలతో ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ ఒకటి ఉంటుంది. రెండవది ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్. చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
Also read: Civils Notification 2025: సివిల్స్ నోటిఫికేషన్ విడుదల, చివరి తేదీ, అర్హత ఇతర వివరాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి